కెజిఎఫ్2 విలన్ పాత్రపై వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చిన సుధీప్

కన్నడ స్టార్ హీరో సుదీప్ ఈగ సినిమాలో విలన్ రోల్ చేశారు. అలాగే బాహుబలి 1 మరియు సైరా వంటి చిత్రాలలో కీలక పాత్రలు చేయడం జరిగింది. ఇక సల్మాన్ హీరోగా తెరకెక్కిన దబంగ్3 మూవీలో కూడా ఆయన విలన్ రోల్ చేయడం విశేషం. కాగా ఇండియా వ్యాప్తంగా క్రేజ్ నెలకొని ఉన్న కెజిఎఫ్ 2లో విలన్ అధీర్ పాత్ర కోసం సుధీప్ ని సంప్రదించారని కొద్దిరోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కాగా ఈ వార్తపై నటుడు సుధీప్ స్పస్టత ఇచ్చారు.

ప్రచారం జరుగుతున్నట్లుగా కెజిఎఫ్ 2 లో విలన్ పాత్ర కోసం తనని ఎవరూ సంప్రదించలేదని ఆయన చెప్పారు. ఇక కెజిఎఫ్ 2 లో అధీర పాత్ర బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చేస్తున్నారని తెలిసింది అన్నారు. ఇక సంజయ్ దత్ సార్ అంటే ఇంకా చెప్పేది ఏముంది. ఆయన అద్బుతంగా చేస్తారు అన్నారు. కెజిఎఫ్ ఫస్ట్ పార్ట్ చూడడానికి టీమ్ నన్ను పిలిచారు. అంతకు మించి కెజిఎఫ్ 2 లో ఏ పాత్ర కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు అని సుధీప్ అన్నారు.

ఆయన వివరణతో కెజిఎఫ్ 2 మూవీలో విలన్ పాత్ర కోసం ఆయన్ని సమర్దించారన్న వార్తలో నిజం లేదని తేలిపోయింది. అలాగే ఈ మధ్య సర్కారు వారి పాటలో మహేష్ కి విలన్ సుధీప్ నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ మూవీలో విలన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉన్న తరుణంలో దర్శక నిర్మాతలు సుధీప్ ని తీసుకుంటే బెటర్ అనుకుంటున్నారని వార్తలు రావడం జరిగింది. కాగా ఆ వార్తలలో కూడా నిజం లేదని తెలుస్తుంది. కొన్ని సినిమాలలో సుధీప్ విలన్ గా నటించగా, అనేక స్టార్ హీరోల సినిమాలలో విలన్ పాత్ర చేస్తున్నండంటూ పుకార్లు లేస్తున్నాయి.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus