Sudha Kongara: సుధా కొంగర మొదటి సినిమా ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?

సుధా కొంగర.. అందరికీ సుపరిచితమే. తమిళ స్టార్ డైరెక్టర్ గా ఈమె కొంతమందికి తెలుసు. అలాగే సీనియర్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం శిష్యురాలిగా కూడా చాలా మంది తెలుసని చెప్పొచ్చు. వెంకటేష్ తో చేసిన ‘గురు’ అనే సినిమా ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో వెంకటేష్ ను చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసిన ఘనత సుధాకి దక్కింది. ‘గురు’ చిత్రం తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ‘ఇరుది శుట్రు'(షాలా కడూస్) కి రీమేక్ అనే సంగతి తెలిసిందే.

వాస్తవానికి ముందుగా ఈ కథని వెంకటేష్ కే చెప్పింది సుధా కొంగర. కానీ వెంకీ ఆ టైంకి బిజీగా ఉండటంతో చేయలేకపోయారు. అది పక్కన పెడితే.. ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం సుధా కొంగరకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే దీనికి నేషనల్ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం ఆమెతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు. వాస్తవానికి ఆమె సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ కి చెందిన విజయవాడ అనే విషయం ఎక్కువమందికి తెలిసుండదు.

ఆమె (Sudha Kongara) సినీమా పరిశ్రమలోకి రావాలని ప్రయత్నించింది టాలీవుడ్ నుండే అని ఎక్కువ మందికి తెలిసుండదు. తెలుగులో ఆమె డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘గురు’ అని అంతా అనుకుంటారు. కానీ కాదు. తెలుగులో ఆమె 2008 లోనే ‘ఆంధ్రా అందగాడు’ అనే మూవీని డైరెక్ట్ చేసింది. ఇదో కామెడీ అండ్ రొమాంటిక్ మూవీ. ఇందులో శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ భగవాన్, అభినయశ్రీ, చిత్రం శ్రీను వంటివారు ప్రధాన పాత్రలు పోషించారు.

అసలు ఈ సినిమా రిలీజ్ అయిన సంగతే చాలా మందికి తెలీదు. కానీ ఇప్పుడు సుధా కొంగర స్టార్ డైరెక్టర్ కాబట్టి… కొంతమంది నెటిజన్లు ఆమె గతంలో తీసిన సినిమాల పోస్టర్స్ ను షేర్ చేస్తూ ఆమెను ట్రెండింగ్లో నిలబెట్టారు. ఈ క్రమంలో ఆంధ్రా అందగాడు అనే సినిమా పోస్టర్ కూడా వైరల్ అవుతుండడం విశేషంగా చెప్పుకోవాలి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus