Sudheer Babu: సినిమాల్లోకి రాకముందు చేసిన పనులు చెప్పిన సుధీర్‌బాబు.!

సుధీర్‌బాబు.. ఇండస్ట్రీలోకి కృష్ణ అల్లుడిగా, మహేష్‌బాబు బావగా వచ్చాడు. ఆ తర్వాత తనుకు మాత్రమే సాధ్యమయ్యే సినిమాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో నైట్రోస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు టాలీవుడ్‌లో హీరోగా సినిమాలు చేస్తూనే, బాలీవుడ్‌లో విలన్‌గా మెప్పించాడు. అయితే గతంలో ఆయన పేర్లు మార్చుకుంటూ తిరిగేవాడని తెలుసా? ఆ విషయం ఆయనే ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే అది ఆయన సినిమాల్లోకి రాకముందు కాదు.. అంతకుముందు. ఇంతకీ ఏమైందంటే…సుధీర్‌బాబు ఇటీవల స్మిత టాక్‌ షో ‘నిజం’ అనే కార్యక్రమానికి వెళ్లారు.

తన స్నేహితుడు పుల్లెల గోపీచంద్‌తో కలసి కార్యక్రమానికి వచ్చిన సుధీర్‌బాబు నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. వీళ్లిద్దరూ గతంలో ప్రొఫెషనల్‌ బ్యాడ్మింటన్‌ ఆడిన విషయం తెలిసిందే. ఆ రోజుల్లో ఇంట్లోవాళ్లకు తెలియకుండా బ్మాడ్మింటన్‌ టోర్నమెంట్‌ల్లో పాల్గొనేవాడట సుధీర్‌బాబు. అయితే ఆ విషయం ఇంట్లో తెలియకుండా ఉండటానికి పేరు మారుస్తూ ఉండేవారట. అలా ఓసారి బెంగళూరులోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో గోపీచంద్‌, సుధీర్‌బాబు తొలిసారి కలుసుకున్నారట. ఆ సమయంలో ఆ టోర్నీకి వెళ్లినవారిలో తెలుగువాళ్లు వాళ్లిద్దరే అట.

ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలన్నా కలిసి వెళ్లేవాళ్లరట. అలా వాళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని చెప్పారు సుధీర్‌బాబు. క్రీడాకారుడిగా, కోచ్‌గా రెండు రంగాల్లోనూ విజయం అందుకునేవారు అరుదుగా ఉంటారని, వారిలో గోపీచంద్‌ ఒకరు అని సుధీర్‌బాబు తెలిపారు. అసలు ఈ కార్యక్రమానికి సుధీర్‌బాబు, గోపీచంద్ ఎందుకు కలిసి వచ్చారు అని డౌట్‌ వచ్చి ఉంటే.. వాళ్లు గతంలో ఓ సినిమా విషయంలో కొలాబరేట్‌ అయ్యారనే విషయం మీకు తెలిసి ఉండకపోవచ్చు.

ఎందుకంటే పుల్లెల గోపీచంద్ జీవిత కథను సుధీర్‌బాబు సినిమాగా చేయాలని అనుకున్నారు. ఈ మేరకు అనౌన్స్‌మెంట్‌ కూడా అయ్యింది. అయితే ఏమైందో ఏమో ఆ సినిమా గురించి తర్వాత ఎలాంటి చర్చా లేదు. ఇటీవల ‘హంట్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సుధీర్‌బాబు ప్రస్తుతం ‘మాయా మశ్చీంద్ర’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలో మరిన్ని సినిమాలు అనౌన్స్‌ అవుతాయని సమాచారం.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus