Sudheer Babu: మహేష్ తో మల్టీస్టారర్ గురించి సుధీర్ రియాక్షన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • May 30, 2024 / 09:21 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) రాజమౌళి (Rajamouli) కాంబో మూవీ రిలీజ్ కావడానికి మరో మూడేళ్ల సమయం ఉంది. ఈ సినిమా ఇప్పట్లో విడుదలవుతుందని మహేష్ ఫ్యాన్స్ కూడా అశ పడటం లేదు. మహేష్ బాబుతో మల్టీస్టారర్ గురించి సుధీర్ బాబు (Sudheer Babu) ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన హరోంహర (Harom Hara) జూన్ 14వ తేదీన రిలీజ్ కానుంది.

ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ సందర్భంగా మహేష్ బాబుతో మల్టీస్టారర్ చేయాలని నాకు కూడా ఉందని అయితే మా ఇద్దరికీ సరిపోయే కథ ఉంటే మాత్రం కచ్చితంగా నటిస్తామని సుధీర్ బాబు పేర్కొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబు వస్తారో రారో చెప్పలేనని నేను ఇంకా మహేష్ ను సంప్రదించలేదని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటిస్తున్నానని అయితే ఆ సినిమా పనులు ఇంకా మొదలుకాలేదని సుధీర్ బాబు పేర్కొన్నారు.

కృష్ణ, మహేశ్ సినిమాలలో రీమేక్ చేసే ఛాన్స్ వస్తే అల్లూరి సీతారామరాజు చేస్తానని ఆయన తెలిపారు. మంచి సినిమాను అందించాలనే హరోంహర వాయిదా వేశామని ఎన్నికల ఫలితాల హడావిడి పూర్తయ్యాక సినిమా విడుదలైతే బాగుంటుందని సుధీర్ బాబు అన్నారు. నా సినిమాలు ఎవరైనా బాగా లేవని చెబితే వాళ్లు ఇంకా మంచి మూవీ కోరుకుంటున్నారేమో అనిపిస్తుందని ఆయన తెలిపారు.

విమర్శలను పాజిటివ్ గా తీసుకుంటానని సుధీర్ బాబు వెల్లడించారు. నేనెప్పుడూ యాక్షన్ సినిమా చేయాలని అనుకునేవాడినని సుధీర్ బాబు పేర్కొన్నారు. హరోం హర సినిమాతో అలాంటి కథ దొరికిందని ఎంతో రిస్క్ తీసుకుని ఈ సినిమా చేశానని ఆయన అన్నారు. ఈ సినిమా ఔట్ పుట్ అద్బుతంగా ఉందని ట్రెండింగ్ లో ఉన్న కథతో ఈ సినిమా తెరకెక్కిందని సుధీర్ బాబు వెల్లడించారు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో ఇండియాలో ఏ మూవీ తెరకెక్కలేదని సుధీర్ బాబు పేర్కొన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus