Sudheer Babu: ప్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన సుధీర్ బాబు.. ఇప్పుడు అవసరమా.!

సుధీర్ బాబు (Sudheer Babu)  హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. 2018లో వచ్చిన ‘సమ్మోహనం’ (Sammohanam) తర్వాత అతను చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. నాని 25వ సినిమాలో సెకండ్ హీరోగా చేసినా.. అది కూడా సుధీర్ బాబుకి మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali) డిజాస్టర్ అవ్వగా, ‘హంట్’ (Hunt) చిత్రం సుధీర్ బాబు పై విమర్శలు కురిసేలా చేసింది.ఎంతో కష్టపడి చేసిన ‘మామామశ్చీంద్ర’ (Mama Mascheendra) సైతం సుధీర్ బాబుకు చేదు ఫలితాన్నే ఇచ్చింది.

Sudheer Babu

ఇక ‘హరోం హర’ (Harom Hara) వంటి యాక్షన్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అది బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేదు అనే చెప్పాలి. అయితే ఓ విషయంలో మాత్రం సుధీర్ బాబుని అభినందించాల్సిందే. ఎందులో అంటే.. ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలే చేస్తూ వస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్.. ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ ను కలిగించాయి.

దీనికి హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కడం కూడా కష్టమే. ఎందుకంటే రజినీకాంత్ (Rajinikanth)  , గోపీచంద్ (Gopichand) వంటి హీరోల సినిమాలు పోటీగా రిలీజ్ అవుతున్నాయి. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. సుధీర్ బాబు ప్రస్తుతం ‘జటాధర’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ‘చి ల సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట సుధీర్ బాబు.

మొదటి సినిమాతో ఓకే అనిపించిన రాహుల్.. ఆ తర్వాత చేసిన ‘మన్మధుడు 2’ (Manmadhudu 2) తో నిరాశపరిచాడు. ప్రస్తుతం రష్మికతో (Rashmika Mandanna)  ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా చేస్తున్నాడు. ఇది హిట్ అయితే రాహుల్ మళ్ళీ ఫామ్లోకి వస్తాడు. ‘మా నాన్న సూపర్ హీరో’ తో సుధీర్ హిట్టు కొడితే.. ఆ ప్రాజెక్టు పై బజ్ ఏర్పడుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus