సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) మెజీషియన్ గా కెరీర్ ను ప్రారంభించాడు. తర్వాత ‘జబర్దస్త్’ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. టీం లీడ్ గా చాలా స్కిట్స్ గెలుచుకుని బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా పలు టీవీ షోలలో హోస్ట్ గా చేశాడు. ముఖ్యంగా రష్మీతో లవ్ ట్రాక్ అంశంతో సుధీర్ పేరు మార్మోగింది. దీంతో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి సుధీర్ బాగా దగ్గరయ్యాడు. దీంతో హీరోగా చేసే అవకాశం దక్కింది.
‘సాఫ్ట్ వేర్ సుధీర్’ ‘గాలోడు’ ‘కాలింగ్ సహస్ర’ (Calling Sahasra) వంటి సినిమాల్లో హీరోగా చేశాడు సుధీర్. ఇందులో ‘గాలోడు’ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. వీటితో పాటు ‘గోట్’ అనే సినిమాలో కూడా హీరోగా చేశాడు. ఆ సినిమాకి సంబంధించి ఒక పాట కూడా బయటకు వచ్చింది. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ టీవీ షోలో సుధీర్ ఓ ఫన్నీ స్కిట్ చేశాడు. ‘నంది కొమ్ముల నుండి పరమశివుని చూసే క్రమంలో అతనికి రంభ (Rambha) కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమెతో అతను ఫ్లర్ట్ చేస్తాడు. ఈ ఎపిసోడ్ మొత్తం హిందూ సంఘాలకి కోపం తెప్పించింది. ‘నంది కొమ్ముల మధ్య నుండి చూస్తే శివుడు కనిపించాలి కానీ పైత్యం కాదు’ అంటూ వారు మండి పడుతున్నారు.
వాస్తవానికి ‘బావగారు బాగున్నారా’ (Bavagaru Bagunnara?) సినిమాలోని సీన్ ని రీ క్రియేట్ చేశారు. ఆ సినిమాలో కూడా సీన్ ఇలానే ఉంటుంది. యూట్యూబ్లో ఆ సినిమా అందుబాటులో ఉంది. టీవీల్లో చాలా సార్లు టెలికాస్ట్ అయ్యింది. మరి చిరు (Chiranjeevi) చేసినప్పుడు ఈ హిందూ సంఘాల పెద్దలు ఏం చేస్తున్నారు? కామెడీ కోసం చేసిన చిన్న ఎపిసోడ్స్ తో కూడా వార్తల్లో ఉండాలి అని వాళ్ళు పబ్లిసిటీ కోసం తపిస్తున్నారో ఏమో..!