నాగవంశీ (Suryadevara Naga Vamsi) ‘అక్టోబరు ప్రారంభం’ అంటున్నారు.. మరి అట్లీ (Atlee Kumar) సినిమా ఉంటుందా? ఉండదా? క్లారిటీ ఇస్తే బాగుండు అంటూ కొన్ని రోజులపాటు అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ ఆందోళన చెందారు. వాళ్లందరికీ ఊహించని షాక్ ఇస్తూ AAA టీమ్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. సినిమా ఓకే అవ్వడం నుండి, సినిమా కోసం విదేశాలకు వెళ్లి లుక్ టెస్ట్‌లు, వీఎఫ్‌ఎక్స్ పనులకు సంబంధించి చర్చలు, ఏర్పాట్లు చూపించారు. దీంతో ఇలా ఓ సినిమాను అనౌన్స్ చేయడం అద్భుతం అంటూ అభిమానులు ముచ్చటపడిపోయారు.
అలాంటి వారికి టీమ్ నుండి ఇంకో సర్‌ప్రైజ్ ఉందా అంటే అవును ఉంది అనే చెప్పాలి. త్రివిక్రమ్‌తో (Trivikram) అల్లు అర్జున్ సినిమా తొలుత ఉంటుంది. ఆ తర్వాత అట్లీ సినిమా ఉండొచ్చు అని నాగవంశీ ‘అక్టోబరు’ మాట వల్ల బయటికొచ్చింది. అయితే ఆ సినిమాకు ఇచ్చిన AA22 నెంబరును అట్లీ సినిమాకు ఇచ్చేశారు. అలా కొత్త నెంబరుతో వీడియోను రిలీజ్ చేశారు. అందులో అమెరికాలో వివిధ వీఎఫ్‌ఎక్స్ సంస్థలతో దర్శకుడు అట్లీ, హీరో అల్లు అర్జున్ మాట్లాడటం ఆ వీడియోలో చూడొచ్చు.
అలాగే బన్నీ ముఖాన్ని స్కాన్ చేసి ఓ వీడియో కూడా తీసుకున్నారు. ఇది లుక్ టెస్ట్ కోసం తీసిన వీడియో అని తెలుస్తోంది. అంతేకాదు ఆ లుక్ టెస్టు వీడియో బయటకు వస్తుంది అంటున్నారు. సినిమా ఎంత భారీగా ఉంటుంది అనే విషయం చెప్పడానికే టీమ్ అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేసిందనే మాట అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బన్నీని వీఎఫ్‌ఎక్స్‌లో చిత్రీకరించారు.
ఆ వీడియోను పూర్తి స్థాయి ఎఫెక్ట్‌లు యాడ్ చేసి రిలీజ్ చేస్తారని టాక్. సినిమాకు కొబ్బరికాయ కొట్టే సమయంలో ఈ వీడియో వస్తుంది అంటున్నారు. త్వరలో సినిమాను లాంఛనంగా ప్రారంభించి.. ఏడాది ఆఖరు నుండి షూటింగ్ ప్రారంభిస్తారు అనే మాటలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఇందులో ఎంత నిజం ఉందో?