Calling Sahasra: ‘కాలింగ్ సహస్ర’ ముందుగా ఆ హీరోకి చెప్పాడట.. కానీ..!

బుల్లితెర పవర్ స్టార్ గా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్‌ అలియాస్ సుధీర్ ఆనంద్. అతను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర’. ‘షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌’, ‘రాధా ఆర్ట్స్’ బ్యానర్ల పై విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ విక్కిరాలా ఈ చిత్రానికి దర్శకుడు.డాలీషా హీరోయిన్‌గా నటించింది. డిసెంబ‌ర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్ కొత్తగా ఉన్నాయి.

ఇది ఒక థ్రిల్లర్ కథాంశం అని అర్థమవుతుంది. అయితే ఈ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ సుధీర్ కాదట. మరో హీరో మిస్ చేసుకోవడం వల్ల.. ఈ ప్రాజెక్టులోకి సుధీర్ వచ్చి చేరాడట. ముందుగా ఈ కథని అడివి శేష్ కి వినిపించాడట దర్శకుడు అరుణ్ విక్కిరాల. ఈ విషయం పై అతను మాట్లాడుతూ.. ” ‘గూఢచారి’ టైంలో అడివి శేష్ గారికి ఈ కథను చెప్పాను. ఆయన చేయాల్సిన కథ ఇది. కానీ మిస్ అయ్యింది. ఆ సినిమా తర్వాత నేను ఎన్నో యాడ్స్ డైరెక్ట్ చేశాను.

కరోనా టైంలో పోలీసులపై ఎన్నో డాక్యుమెంటరీస్ వచ్చాయి. అందులో చాలా వరకు నేను చేసినవే.అయితే ‘త్రీ మంకీస్’ సినిమాకి నేను రైటర్‌గా పని చేశాను. ‘త్రీ మంకీస్’ లో సుధీర్ గారు కూడా నటించారు. అయితే ఆ సినిమా కంటే ముందుగానే ఈ కథను సుధీర్ గారికి చెప్పాను. నాకు ఎందుకు ఈ కథ చెబుతున్నారు.. నేను సెట్ అవుతానా? అంటూ ఆయన భయపడ్డారు. కానీ ‘త్రీ మంకీస్’ తో నేను క్లోజ్ అవ్వడం వల్ల.. ఆ తర్వాత ప్రాజెక్టు స్టార్ట్ చేశాను” అంటూ అరుణ్ చెప్పుకొచ్చాడు.

అతను ఇంకా మాట్లాడుతూ.. ” (Calling Sahasra) ‘కాలింగ్ సహస్ర’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని చాలామంది అడుగుతున్నారు? కాలింగ్ అనేది కంపెనీ పేరు. సహస్ర అనేది హీరోయిన్ పాత్ర పేరు. కాలింగ్ సహస్ర అనేది కథలోంచి పుట్టిందే. సినిమాకు సరిపోయే టైటిల్ అని ఇది ఫిక్స్ చేశాం.ఇది సుధీర్ చేసిన ఓ ప్రయోగం. సినిమా చూస్తున్నంత సేపు సుధీర్ మీకు అస్సలు గుర్తుకురాడు. అలాగే ఈ సినిమాలో ‘దసరా’ ఫేమ్ రవితేజ నన్నిమల కూడా ఓ కీలక పాత్ర పోషించాడు.

అతను కూడా చాలా బాగా నటించాడు. శివ బాలాజీ కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ కంటే ఇంకో 20 శాతం అదనంగా పెట్టాల్సి వచ్చింది. అందుకు నిర్మాతలు బాగా సహకరించారు. సంగీత దర్శకులు.. మోహిత్ అందించిన పాటలు,ఆర్ఆర్ రాబిన్ అందించిన బీజీయం హైలెట్ గా ఉంటుంది” అంటూ దర్శకుడు అరుణ్ విక్కిరాల తెలిపారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus