Sudigali Sudheer: వచ్చేస్తా అని అడిగితే.. కాస్త ఆగు అన్నారు: సుధీర్‌

జబర్దస్త్‌ నుండి వెళ్లిపోవడం రెండు రకాలు. ఒకటి ఇక్కడ నచ్చక వెళ్లిపోవడం, రెండోది కొద్ది రోజులు బయటకు వెళ్లి రావడం. తొలి రకం చాలా ఎక్కువగా, రెండో రకం చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే తాను రెండో రకం మనిషిని అని చెబుతున్నాడు సుధీర్‌. సుడిగాలి సుధీర్‌ అంటూ.. జబర్దస్త్‌లో ఏళ్ల తరబడి టీమ్‌ను రన్‌ చేశాడు. అయితే ఏమైందో ఏమో.. ఉన్నపాటుగా నేను వెళ్లిపోతున్నా అంటూ సెలవు చెప్పేశాడు. అయితే ఇప్పుడు మళ్లీ వచ్చేస్తా అంటున్నాడు.

అయితే, ఈ వచ్చేస్తా అనే దగ్గర కండిషన్స్‌ అప్లై అని అంటున్నారు. అయితే ఈ మాట అనేది సుధీర్‌ కాదట, మల్లెమాల టీమ్‌ అని తెలుస్తోంది. ‘గాలోడు’ సినిమా రిలీజ్‌ సందర్భంగా ప్రచారం చేస్తూ ఈటీవీకి వచ్చాడు సుధీర్‌. రెండు ప్రోగ్రామ్స్‌లో తన సినిమాను ప్రమోట్‌ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ‘జబర్దస్త్‌’ నుండి ఎందుకు బయటకు వెళ్లాడు అనే విషయానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ క్లారిటీలోనే ఇంకాస్త కన్‌ఫ్యూజన్‌ ఉంది అనిపిస్తోంది.

మోస్ట్‌ డ్రమటిక్‌గా సుధీర్‌ను ఇదే ప్రశ్న వేశారు ఆ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ. ‘మిమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చిన జబర్దస్త్‌ను ఎందుకు వదిలి వెళ్లిపోయావ్‌’ అంటూ ప్రశ్నించారు ఇంద్రజ. దానికి సుధీర్‌ నేను అందరికీ చెప్పే వెళ్లాను అంటూ సమాధానం ఇచ్చాడు. ‘‘నేను జబర్దస్త్‌ వదిలి వెళ్లిపోతున్నా అని మల్లెమాల టీమ్‌కి చెప్పి పర్మిషన్‌ తీసుకొనే వెళ్లాను. ఆరు నెలలు నాకు వేరే పనులు ఉన్నాయని చెప్పే వెళ్లాను. ఇప్పుడు తిరిగి రావడానికి రెడీగా ఉన్నాను’’ అని సుధీర్‌ చెప్పాడు.

దీంతో ఇక సుధీర్‌ ఎంట్రీ పక్కా అనుకుంటుండగా.. చిన్న షాక్‌ రివీల్‌ చేశాడు. మల్లెమాల టీమ్‌తో మాట్లాడాను అని చెబుతూ, వాళ్లు సరైన సమయం, షో చూసి చెబుతాం అన్నారు అని చెప్పాడు సుధీర్‌. దీంతో సుధీర్‌ రీఎంట్రీ జబర్దస్త్‌లో ఉండదా అనే ప్రశ్న మొదలైంది. ఇప్పుడు తాను వచ్చేస్తా అని అంటున్నా.. ఆ షోలోకి కాకుండా వేరే షో కోసం, వేరే సమయం కోసం ఎందుకు ఆగడం అనే మాట సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus