సుహాస్(Suhas) .. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించాడు.తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ‘మజిలీ’ ‘ప్రతిరోజూ పండగే’ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. అయితే తర్వాత హీరోగా మారి ‘కలర్ ఫోటో’ చేశాడు. అది డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. దానికి నేషనల్ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత చేసిన ‘రైటర్ పద్మభూషణ్’ ‘అంబాజీపేట మ్యారేజీబ్యాండు’ బాగానే ఆడాయి.
కానీ ఆ తర్వాత చేసిన ‘ప్రసన్నవదనం’ ‘శ్రీరంగనీతులు’ పెద్దగా ఆడలేదు. తాజాగా వచ్చిన ‘జనక అయితే గనక’ సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. అది క్యాష్ చేసుకుంటుంది అంటూ లేదు. ఫ్యామిలీ సినిమా కాబట్టి దసరా సెలవుల్లో ఈ సినిమా సందడి ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. తక్కువ రేట్లకే అమ్మినప్పటికీ ‘జనక అయితే గనక’ ఇంకా బ్రేక్ ఈవెన్ అయ్యింది లేదు.
సో థియేట్రికల్ గా సుహాస్ సినిమాలకి పెద్దగా క్రేజ్ లేదేమో అనే కామెంట్స్ ఇప్పుడు మొదలయ్యాయి. ఓటీటీ పరంగా ‘జనక అయితే గనక’ సేఫ్ అయినట్టు టాక్ వినిపిస్తుంది. కానీ థియేట్రికల్ సక్సెస్ మాత్రం కష్టంగానే కనిపిస్తుంది. ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ లో రూపొందిన ఈ సినిమా కచ్చితంగా దసరా విన్నర్ గా నిలుస్తుంది అనుకుంటే..
అలాంటిదేమీ జరగలేదు. మరోపక్క సినిమాపై కాన్ఫిడెన్స్ తో ఓవర్సీస్ రైట్స్ తీసుకున్నాడు.. సుహాస్. అక్కడ కూడా సినిమా అనుకున్న రేంజ్లో పెర్ఫార్మ్ చేయడం లేదు. అలా కూడా ఈ ‘జనక అయితే గనక’ సుహాస్ కి పెద్ద డిజప్పాయింట్మెంట్ అని చెప్పాలి.