Sujatha, Rakesh: రాకింగ్ రాకేష్ మైండ్ బ్లాక్ చేసిన సుజాత.. ఏమైందంటే?

‘బిగ్ బాస్ 4 ‘ కంటెస్టెంట్ సుజాత అందరికీ సుపరిచితమే. ఆ షోలో ఈమె తన గేమ్ తో ప్రేక్షకులను మెప్పించింది. దానికి ముందు ‘జోర్దార్’ అనే టీవీ షోలో తెలంగాణ యాసలో వార్తలు చెబుతూ పాపులర్ అయ్యింది. ‘బిగ్ బాస్ 4 ‘ ఈమె కెరీర్ కి బాగా హెల్ప్ అయ్యింది అనే చెప్పాలి. ఆ తర్వాత వరుసగా ఈమెకు పలు సినిమాల్లో ఛాన్సులు లభించాయి. ‘సేవ్ ది టైగర్స్’ వంటి వెబ్ సిరీస్..లో కూడా నటించింది.

మరోపక్క ‘జబర్దస్త్’ కామెడీ షోలో కూడా రాకింగ్ రాకేష్ తో కలిసి స్కిట్స్ లో పాల్గొనేది. మరోపక్క వారు కొన్నాళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిపిన సంగతి తెలిసిందే. తర్వాత పెద్దలను ఒప్పించడం, గత ఏడాది పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ జంట.. మరోపక్క కెరీర్ పరంగా కూడా కష్టపడుతున్నారు. అయితే ఈ మధ్యనే వాస్తు దోషం వల్ల వీళ్ళు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయడం జరిగింది.

ఇప్పుడు ఏకంగా ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లు ఓ వీడియో ద్వారా తెలిపి అందరికీ షాకిచ్చింది. పనిలో పనిగా తన భర్తకు కూడా ఈ విషయం తెలీదని చెప్పి సర్ ప్రైజ్ చేసింది. దీంతో తన భర్త రాకింగ్ రాకేష్ సంతోషం వ్యక్తం చేస్తుంటే.. ‘ఇది మన ఇల్లు కాదు పక్కింటోళ్లు కొన్న ఇల్లు’ అంటూ చెప్పి రాకేష్ తో (Sujatha, Rakesh) పాటు అందరినీ షాక్ కి గురిచేసింది సుజాత. దీంతో రాకేష్ మైండ్ బ్లాక్ అయినట్టు అయ్యింది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus