Sukumar: ఆ హీరోలతో సుకుమార్ సినిమాలు తీస్తారా?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఈతరం డైరెక్టర్లలో యువతకు నచ్చే సినిమాలను తెరకెక్కించడంతో పాటు ఆ సినిమాలతో విజయాలను అందుకుంటున్న దర్శకుడిగా సుకుమార్ కు పేరుంది. ఆర్య సినిమాతో దర్శకునిగా సుకుమార్ కెరీర్ మొదలుకాగా ఈ దర్శకుని కెరీర్ లో హిట్లు, ఫ్లాపులు ఉన్నా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా ప్రత్యేకమే అని చెప్పాలి. క్లాస్ సినిమాలతో పాటు మాస్ సినిమాలను కూడా అద్భుతంగా తెరకెక్కించే దర్శకులలో సుకుమార్ ఒకరని చెప్పవచ్చు.

తొలి సినిమా ఆర్యతో సక్సెస్ ను సొంతం చేసుకున్న సుకుమార్ ఆ తర్వాత రెండో సినిమాగా జగడం సినిమాను తెరకెక్కించి ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఆర్య2 సినిమా యావరేజ్ రిజల్ట్ ను అందుకోగా 100% లవ్ సినిమాతో సుకుమార్ ఖాతాలో సక్సెస్ చేరింది. 1 నేనొక్కడినే సినిమా నిరాశపరిచినా ఒక వర్గం ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. నాన్నకు ప్రేమతో సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన సుకుమార్

ఆ తర్వాత కెరీర్ విషయంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. రంగస్థలం, పుష్ప ది రైజ్ సినిమాల విజయాలతో సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగితున్నారు. పుష్ప ది రూల్ కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే సుకుమార్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

అయితే సుకుమార్ ఇన్నేళ్ల సినీ కెరీర్ లో సీనియర్ హీరోలకు మాత్రం దూరంగా ఉన్నారు. సీనియర్ హీరోలతో సుకుమార్ సినిమాలను తీస్తే బాగుంటుందని ఆయన అభిమానులు, సీనియర్ హీరోల అభిమానులు కోరుకుంటుకున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో నటించడానికి సీనియర్ హీరోలు నో చెప్పే అవకాశం అయితే లేదు. ఈ కాంబినేషన్ లో సినిమాల దిశగా అడుగులు పడతాయేమో చూడాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus