Sukumar: 1 నేనొక్కడినే విషయంలో సుకుమార్ చేసిన తప్పు ఇదేనా?

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన క్లాసిక్ సినిమాలలో 1 నేనొక్కడినే సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పును పొందే విషయంలో ఫెయిలైంది. అయితే ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 1 నేనొక్కడినే సినిమా కొరకు మహేష్ బాబు రియల్ స్టంట్స్ చేశారు. మహేష్ బాబుకు ఈత సరిగ్గా రాకపోయినా లైఫ్ జాకెట్ లేకుండా రిస్క్ చేసి మరీ ఈ సినిమాలోని సముద్రంలోని ఫైట్ సీన్లలో నటించారు.

లైఫ్ జాకెట్ లేకుండా మహేష్ బాబు బోటును ప్రొఫెషనల్ డ్రైవర్ ఏ విధంగా నడిపారో అదే విధంగా నడిపారని సమాచారం. సుకుమార్ ఒక సందర్భంలో 1 నేనొక్కడినే సినిమా గురించి ప్రస్తావిస్తూ ఈ విషయాలను వెల్లడించడం జరిగింది. ఈ సినిమా రిజల్ట్ గురించి సుకుమార్ మాట్లాడుతూ హిట్ సినిమాను ఫ్లాప్ చేశానని అనిపిస్తుందని పేర్కొన్నారు. ఒక సీన్ తో వెర్షన్ మాత్రం మార్చేయొచ్చని ఆయన అన్నారు.

హీరో ఒక మానసిక సమస్యతో బాధ పడుతుంటాడని అది నిజం కాదని హీరో డ్రామా ప్లే చేస్తున్నాడని ఒక వెర్షన్ ను అనుకున్నానని సుకుమార్ తెలిపారు. ఈ వెర్షన్ చెప్పిన సమయంలో రామ్ ఆచంటకు సినిమా బాగా నచ్చిందని సుకుమార్ చెప్పుకొచ్చారు. కానీ నేను ఎమోషనల్ సైడ్ అయిపోయి ప్రస్తుతం ప్రేక్షకులు చూస్తున్న వెర్షన్ తీశానని ఆయన తెలిపారు.

ఇంకో రెండు సన్నివేశాలను తీసి ఎడిటింగ్ టేబుల్ పై చూసుకుని ఉంటే బాగుండేదని (Sukumar) సుకుమార్ చెప్పుకొచ్చారు. 1 నేనొక్కడినే మూవీ నిడివి పెరిగిపోవడం వల్ల ఆ మూవీలోని చాలా సీన్లను తీసేశామని సుకుమార్ కామెంట్లు చేశారు. ఈ రీజన్ వల్లే ప్రేక్షకులకు అర్థం కాలేదమో అని సుకుమార్ చెప్పుకొచ్చారు. 1 నేనొక్కడినే సినిమాకు సంబంధించి సుకుమార్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus