Pushpa: పుష్ప రిలీజ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి పుష్ప సినిమా రిలీజ్ డేట్ మారుతుందని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పుష్ప సినిమా ఏకంగా 4 నెలలు పోస్ట్ పోన్ కానుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా మేకర్స్ పుష్ప రిలీజ్ డేట్ మారిందని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

ఆగష్టు నెల 13వ తేదీనే పుష్ప సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటన చేశారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే పలు సినిమాల షూటింగ్ లు వాయిదా పడినా సుకుమార్ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ సైతం షూటింగ్ లో పాల్గొంటూ సినిమా షూటింగ్ వాయిదా పడకుండా వ్యవహరిస్తున్నారు. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ వల్ల పుష్ప సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది.

కరోనా వల్ల సమయం వృథా అవుతుండటంతో సుకుమార్ షూటింగ్ ఆపకూడదని భావిస్తున్నారు. బన్నీకి విలన్ గా ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తుండగా ఈ సినిమా సక్సెస్ అయితే రష్మికకు ఇతర స్టార్ హీరోల సినిమాల్లొ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. రంగస్థలం సినిమా తరువాత సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని సమాచారం. బన్నీ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఆగష్టు 13వ తేదీనే సినిమాను రిలీజ్ చేయాలని ఆ విషయంలో తగ్గేదే లేదని బన్నీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus