Sukumar: గౌతమ్‌ సినిమా అతనికి.. అతని సినిమా చరణ్‌కా.. డీల్‌ ఇదేనా?

సుకుమార్‌ తర్వాతి సినిమా ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం రావడానికి చాలా సమయం ఉంది. అయితే ఇప్పుడు చర్చ జరగడానికి కారణం ఆయన నెక్స్ట్‌ సినిమా ఏ హీరోతో అవ్వొచ్చు అని. ఎందుకంటే ‘పుష్ప 2’ మీద ఉన్న అంచనాలు అలా ఉన్నాయి. అదేంటి అనుకుంటున్నారా? ‘పుష్ప: ది రైజ్‌’తో భారీ స్థాయిలో విజయం అందుకున్న సుకుమార్‌ తన తర్వాతి సినిమా ‘పుష్ప: ది రూల్’తో మరో భారీ విజయం అందుకోవడం పక్కా అంటున్నారు.

దీంతో ఆ నెక్స్ట్‌ అంతకుమించిన సినిమా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సుకుమార్‌ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి అని చెబుతున్నారు. అందులో విజయ్‌ దేవరకొండతో అయితే మరోది రామ్‌చరణ్‌తో. విజయ్‌ సినిమాను ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. అయితే ఆ తర్వాత ఎలాంటి చర్చా లేదు. దీంతో ఈ సినిమా ఉందా లేదా అనే చర్చ మొదలైంది. మరోవైపు రామ్‌చరణ్‌ సినిమా అధికారికంగా చెప్పకపోయినా.. ఆ సినిమాలో ఓ సీన్‌ షూటింగ్‌ కూడా అయిపోయింది అని చెబుతున్నారు.

ఈ మేరకు వివిధ సందర్భాల్లో సుకుమార్‌ టీమ్‌, ఓసారి రాజమౌళి కూడా చెప్పారు. ఈ రెండు అంశాలను, ‘పుష్ప: ది రూల్‌’ తర్వాత వచ్చే క్రేజ్‌ను పరిగణలోకి తీసుకొని సుకుమార్‌ తర్వాతి సినిమా చరణ్‌తోనే అని ఓ లెక్కకొచ్చేస్తున్నారు. దీంతో విజయ్‌ దేవరకొండకు నిరాశ తప్పదని ఫిక్స్‌ అయిపోతున్నారు. ఎందుకంటే ఈ సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్‌ అయ్యింది. మంచి ప్రేమకథ అని కూడా చెప్పారు.

అయితే ప్రస్తుతం సుకుమార్‌(Sukumar) ప్రేమకథలు చేసే రేంజిలో లేరు. పాన్‌ ఇండియా లెవల్‌లో లార్జర్‌ ద్యాన్‌ లైఫ్‌ కథలే చేసే పరిస్థితి. కాబట్టి రామ్‌చరణ్‌ సినిమానే అంటున్నారు. ఆ లెక్కన గౌతమ్‌ తిన్ననూరితో రామ్‌ చరణ్‌ చేయాల్సిన సినిమాను విజయ్‌ దేవరకొండ చేస్తున్నట్లు.. విజయ్‌ చేయాల్సిన సుకుమార్‌ సినిమాను రామ్‌చరణ్‌ చేస్తున్నాడు అనుకోవచ్చు. ఇది ఓ రకంగా డీల్‌ అని కూడా అంటున్నారు. మరి ఏది జరుగుతుందో చూడాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus