Sukumar, Allu Arjun: చరణ్‌కి కొలిసొచ్చింది… బన్నీ ఏం చేస్తాడో

హీరో పాత్రకు వైకల్యం… సినిమాకు విజయం అందిస్తుందా? అంటే అవుననే చెప్పాలి. గత కొంతకాలంగా తెలుగులో వస్తున్న సినిమాల్లో ఇలాంటి పరిస్థితులు చూశాం. ఏదో ఒక అంగవైక్యలం ఉన్న పాత్రలను మన దర్శకులు రాసుకుంటున్నారు. దివ్యాంగులు ఎందులోనూ వెనుకబడిపోరు అని చెప్పడం వారి ఉద్దేశం కావొచ్చు. అలా సుకుమార్‌ రాసుకున్న హిట్‌ కథ ‘రంగస్థలం.’ అందులో చరణ్‌ చెవిటివాడిగా కనిపిస్తాడు. ఇప్పుడు ‘పుష్ప’ కోసం కూడా సుక్కు అలాంటి ఆలోచనే చేశారా?

‘పుష్ప’ ప్రోమో, పాటలు… ఇలా ఏది చూసినా అల్లు అర్జున్‌ క్యారెక్టరైజేషన్‌లో చిన్న తేడా కనిపిస్తుంటుంది. అదే ఒక భుజం పైకి ఉంటుంది. టీజర్‌, తొలి పాటలో కొద్ది కొద్దిగా కనిపించినా… బుధవారం రిలీజ్‌ అయిన రెండో సింగిల్‌ మాత్రం కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. దీంతో లెక్కల మాస్టారు ‘పుష్ప’ సినిమాకి ‘రంగస్థలం’ ఫ్లేవర్‌ యాడ్ చేశారా అని అనుకుంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల కాలెక్యులేషన్‌ ప్రకారం చూస్తే… ‘పుష్ప’లో బన్నీ అయితే గూనివాడిగా లేదంటే, ఒక చేయి పూర్తిస్థాయిలో పని చేయని వాడిగా కనిపిస్తాడట.

‘రంగస్థలం’లో చరణ్‌ పాత్ర అంతగా ఆకట్టుకుందంటే చిట్టిబాబు వైక్యలం కూడా కొంత కారణం. ఈ మాట ఎవరూ కాదనలేనిది. ఇప్పుడు ‘పుష్ప’రాజ్‌ విషయంలోనూ అలాగే ఆలోచించి రాసుకున్నారా అని అనుకుంటున్నారు. ఇటీవల వచ్చిన ‘మాస్ట్రో’లో కూడా నితిన్‌ దివ్యాంగుడిగా కనిపించి మెప్పించాడు. ఇప్పుడు బన్ని వంతు వచ్చింది. ఏం చేస్తాడో చూడాలి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus