భారీ ధరకు అమ్ముడైన కార్తీ సుల్తాన్

కోలీవుడ్ హీరో కార్తీ మరోసారి తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెట్టాడు అనిపిస్తోంది. తమిళ్ లో ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో దాదాపు తెలుగులో కూడా అదే రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్న కార్తీ చివరగా దొంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. కానీ దానికంటే ముందు వచ్చిన ఖైదీ మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది.

కార్తీ తెలుగులో పోగొట్టుకున్న మార్కెట్ ను మళ్ళీ ఖైదీ తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం కార్తీ సుల్తాన్ తో మరో బిగ్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. యాక్షన్ ఫిల్మ్ గా రానున్న ఆ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ట్రైలర్ కు అయితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను 7.30కోట్లకు వరంగల్ శ్రీను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కార్తీ హోమ్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాకి కన్నన్ దర్శకుడు.

అయితే గత సినిమాలకంటే కూడా కార్తీ ఈ సారి తెలుగు హక్కుల రూపంలో పవర్ఫుల్ ఎమౌంట్ అందుకున్నట్లు స్సమాచారం. సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది కాబట్టి తప్పకుండా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వగలదని టాక్ వస్తోంది. సినిమాలో హీరోయిన్ గా రష్మీక మందన్న నటించింది. ఇక సినిమాను ఏప్రిల్ 2న తమిళ్ నాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus