Anchor Suma: యాంకరింగ్ మానేస్తున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించిన సుమ..!

యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర పై స్టార్స్ లిస్ట్ కనుక తీస్తే అందులో నెంబర్ 1 ప్లేస్ ఈమెకే దక్కుతుంది. ఇంకో 10 ఏళ్ల వరకు కూడా ఈమెనే నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకుంటుంది అనడంలో కూడా సందేహం లేదు. సినిమా ఈవెంట్ల కోసం సుమ అవసరం టాలీవుడ్ కు చాలా ఉంది. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా సినిమాల ప్రమోషన్లకు సుమ అవసరం చాలా ఉంది. అలాంటిది సుమ యాంకరింగ్ మానేస్తుంది అంటూ ఓ వార్త గత రెండు రోజుల నుండి వైరల్ అవుతుంది.

ఆ వార్త ఎలా పుట్టుకొచ్చింది అంటే.. డిసెంబర్‌ 31న ఇయర్ ఎండింగ్ కావడంతో ఈటీవీలో ఓ షో ప్రసారం కాబోతుంది.అందుకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఇందులో సుమ.. ‘నేను ఎన్నో ఏళ్లుగా యాంకర్‌గా చేస్తున్నాను. కాబట్టి కొద్ది రోజులు బ్రేక్‌ తీసుకోవాలని భావిస్తున్నాను’ అంటూ ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ ఉంది. అందుకే ఈ వార్తలు మొదలయ్యాయి. సుమ యాంకరింగ్ మానేస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.

దీంతో సుమ స్నేహితులు, సన్నిహితులు ఆమెకు కాల్‌ చేసి.. ఆరా తీస్తున్నారు. అందుకే సుమ ఈ విషయం పై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో చేసింది. ఈ వీడియో ద్వారా ఆమె ఈ విషయం పై స్పందిస్తూ.. “న్యూ ఇయర్ స్పెషల్ గా ఓ ఈవెంట్ చేశాం. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. అది ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ ప్రోమోలో నేను కొంచెం ఎమోషనల్ అయిన మాట వాస్తవమే. అయితే ఈవెంట్ పూర్తిగా చూస్తే..

అసలు విషయం ఏంటో మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు కంగారు పడకండి. ఇప్పటికే నాకు చాలా మంది.. ‘ఏంటి యాంకరింగ్‌ మానేస్తున్నావా?’ అంటూ ఫోన్లు చేయడం.. మెసేజ్‌లు పెట్టడం చేస్తున్నారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే. అది ఏంటంటే.. నేను టీవీ కోసమే పుట్టాను.. నేను ఎంటర్‌టైన్మెంట్ కోసమే పుట్టాను.. నేను ఎటూ వెళ్లడం లేదు. కాబట్టి, మీరు కంగారు పడకుండా.. హాయిగా.. హ్యాపీగా ఉండండి.. మీ అందరికీ అడ్వాన్స్‌గా హ్యాపీ న్యూ ఇయర్‌’’ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus