ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబో మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) రోజులు గడుస్తున్నా కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది. కల్కి సినిమాలో చిన్నచిన్న మైనస్ లు ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదని అభిమానులు ఫీలవుతారు. అయితే కల్కి సినిమా గురించి సుమన్ (Suman) షాకింగ్ రివ్యూ ఇవ్వగా ఆ రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న సుమన్ కల్కి సినిమాలో ప్లస్ పాయింట్లతో పాటు మైనస్ పాయింట్లను సైతం ప్రస్తావించారు.
కల్కి మూవీ నెమ్మదిగా అనిపించిందని సినిమాలో అరగంట వరకు తీసేయవచ్చని సుమన్ చెప్పుకొచ్చారు. దిశా పటానీ (Disha Patani) సాంగ్, ఫైట్ సినిమాలో కట్ చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సాంగ్, ఫైట్ కల్కి కథకు అసలు సంబంధం లేదని సుమన్ పేర్కొన్నారు. కల్కి డైరెక్టర్ విజన్ కు సెల్యూట్ అని సెకండాఫ్ బాగుందని ఆయన వెల్లడించారు. సినిమాలో అమితాబ్ రోల్ డామినేట్ గా ఉందని సుమన్ చెప్పుకొచ్చారు.
స్టార్ హీరో ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టమని ప్రభాస్ ను టార్జాన్ లా చూపించాలని ఆయన వెల్లడించారు. ప్రభాస్ కు మంచి ఫిజిక్ ఉందని సుమన్ పేర్కొన్నారు. కల్కి సినిమాలో సాంగ్స్ అయితే అస్సలు బాలేవని సినిమాని ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూస్తే నచ్చుతుందని సుమన్ వెల్లడించారు. సుమన్ కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
కల్కి 2898 ఏడీ ఈ నెలాఖరు వరకు కలెక్షన్ల పరంగా అదరగొట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఆగష్టు 15వ తేదీనుంచి ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఆగష్టు చివరి వారం నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వినిపిస్తుండటం గమనార్హం.