Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

‘బిగ్ బాస్ 9’ రసవత్తరంగా మారుతుంది. హౌస్ మేట్స్ ఇప్పుడిప్పుడే తన ఎమోషన్స్ ని బయటపెడుతూ హాట్ టాపిక్ అవుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సీజన్లో సెలబ్రిటీల కంటే కూడా సామాన్యుల డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. కామన్ మెన్స్ ఉన్నంత యాక్టివ్ గా.. సెలబ్రిటీలు ఉండటం లేదు అనేది జనాభిప్రాయం. చాలా వరకు అది నిజమే.

Suman Setty in Bigg Boss 9 Telugu

సెలబ్రిటీలు కాబట్టి.. వాళ్ళు సైలెంట్ గా ఉంటే సరిపోతుంది అని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పారో.. లేక సామాన్యుల ముందు హడావిడి చేయడం ఎందుకని సెలబ్రిటీలు సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారో? ఆడియన్స్ కి ఒక క్లారిటీ అయితే రావడం లేదు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ‘ఈ సీజన్లో నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి?’ అనేది హౌస్ మేట్స్ కి ముందుగానే హింట్ ఇచ్చి ప్రిపేర్ చేసి ఉంచాడు బిగ్ బాస్. ఈ క్రమంలో కామన్ మెన్స్ కి సెలబ్రిటీలను నామినేట్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో కామన్ మెన్స్ ఎంతో ఉత్సాహంతో స్ట్రాంగ్ అనుకున్న సెలబ్రిటీలను నామినేట్ చేసి పడేశారు.

ఇదిలా ఉండగా.. ఈ సీజన్లో కమెడియన్ సుమన్ శెట్టి కూడా ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల్లో అమాయకంగా కనిపిస్తూ నవ్వించే అతను.. బిగ్ బాస్ లో మాత్రం చాలా అయోమయంగా కనిపిస్తున్నాడు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 2 రోజుల్లో ఇతను నోరు విప్పి మాట్లాడింది చాలా అరుదు. హౌస్ లో కూడా అమాయకపు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ.. కాలం గడిపేస్తున్నాడు.

దీంతో కామన్ మెన్ మాస్క్ మెన్ హరీష్.. ‘సుమన్ శెట్టి గేమ్ పరంగా అంతగా యాక్టివ్ గా ఉండటం లేదు’ అని చెప్పి నామినేట్ చేశాడు. ‘దీనికి మీరేమైనా వివరణ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి’ అంటూ హరీష్ కోరాడు. దానికి సుమన్ శెట్టి మళ్ళీ అమాయకంగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి ‘ఏమీ లేదు అన్నాడు’. తర్వాత సంజన ఏమైనా ‘చెప్పాలనుకుంటే చెప్పండి’ అంటూ సుమన్ శెట్టికి చెప్పింది.

దానికి సుమన్ శెట్టి.. ‘నాకు తెలుగు వచ్చు.. అతనికి నేను తెలుగులోనే సమాధానం ఇచ్చాను’ అంటూ ఆమెకి సెటైర్ వేశాడు. తర్వాత ‘మనం హౌస్ లోకి వచ్చి 2 రోజులే అయ్యింది కదా సార్.. కాబట్టి మీరు వెంటనే నేను యాక్టివ్ గా లేను చెప్పడం కరెక్ట్ కాదు’ అంటూ డిఫెండ్ చేసుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ‘హమ్మయ్యా.. సుమన్ శెట్టి నోరు విప్పాడు రా బాబు’ అంటూ చమత్కరిస్తున్నారు.

‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus