Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

‘బిగ్ బాస్ 9’ ఎంతో అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. 9 మంది సెలబ్రిటీలు 5 మంది సామాన్యులతో కలిపి మొత్తంగా 15 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లారు. సెలబ్రిటీలను టెనెంట్స్ గా, కామన్ మెన్స్ ని టెనెంట్స్ గా పెట్టి.. మొదటి రోజు నుండే గేమ్ మొదలుపెట్టాడు బిగ్ బాస్. అయినప్పటికీ మొదటి 2 రోజులు హౌస్ మేట్స్ కొంచెం సెటిల్ అవ్వడానికి టైం ఇచ్చాడు.

Bigg Boss 9 Nominations List

అలాగే హౌస్ మేట్స్ కూడా ఒకరితో మరొకరు ఇంటరాక్ట్ అయ్యి.. ఎదుటి వారి మైనస్ పాయింట్స్ నామినేషన్స్ కొరకు సమకూర్చుకున్నారు అని చెప్పాలి. మొత్తానికి అసలు సినిమా మొదలైంది. ఈసారి నామినేషన్స్ ప్రక్రియ ఎలా ఉండబోతుందో.. ముందు రోజే టీజర్ చూపించి.. హౌస్ మేట్స్ ను ఆ ఘట్టానికి చేర్చాడు బిగ్ బాస్. ఈ క్రమంలో హౌస్ మేట్స్ ఒకరిపై మరొకరు చెప్పుకున్న చాడీలతో హౌస్ కొంచెం వేడెక్కింది అనే చెప్పాలి. కానీ బిగ్ బాస్ కి, ఆడియన్స్ కి కావాల్సింది అదే కాబట్టి.. ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు అని నెటిజన్లు కామెంట్స్ విసురుతున్నారు.

ఇక హౌస్ మేట్స్ ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో.. ‘టేబుల్ పై ఉన్న ఫోటోలు తీసుకెళ్లి సుత్తి తో కొట్టాలి’ అంటూ ఆదేశించాడు బిగ్ బాస్. ముఖ్యంగా సెలబ్రిటీలను కామన్ మెన్స్ ను నామినేట్ చేసే ఛాన్స్ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో రాము రాథోడ్.. శ్రష్టి వర్మని, భరణి.. సంజనని, మాస్క్ మ్యాన్ హరీశ్.. సుమన్ శెట్టిని నామినేట్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో హౌస్ మేట్స్ ఒకరిపై మరొకరు చేసుకున్న కామెంట్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఎక్కువ మంది హౌస్ మేట్స్ సంజనని నామినేట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక నామినేషన్స్ లిస్ట్..ను గమనిస్తే, కామనర్స్ నుండి డెమోన్ పవన్ ఉన్నాడు. ఇక సెలబ్రిటీల నుండి సంజన, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఫ్లోరా షైనీ ఉన్నారు. మరి వీళ్ళలో మొదటి వారం హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయేది ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus