Sumanth Ashwin: ఆ వార్తల్లో నిజం లేదంటున్న సుమంత్ అశ్విన్!

సుమంత్ అశ్విన్, రోహన్ ప్రధాన పాత్రల్లో ఎం.ఎస్.రాజు డైరెక్షన్ లో తెరకెక్కిన 7 డేస్ 6 నైట్స్ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రాలేదనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మేకర్స్ మాత్రం వరుస ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాకు కలెక్షన్లు పెరిగేలా జాగ్రత్త పడుతున్నారు. కెరీర్ తొలినాళ్లలో నిర్మాతగా వరుస విజయాలను సొంతం చేసుకున్న ఎం.ఎస్.రాజు ప్రస్తుతం సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

సుమంత్ అశ్విన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ మా బ్యానర్ లో తెరకెక్కిన వర్షం ప్రభాస్ ను, ఒక్కడు మహేష్ బాబును నిలబెట్టాయని తెలిపారు. హీరో సిద్దార్థ్ కు కూడా తమ బ్యానర్ లో తెరకెక్కిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా లైఫ్ ఇచ్చిందని సుమంత్ అశ్విన్ కామెంట్లు చేశారు. ఈ హీరోలలో ఉన్న స్పెషాలిటీలను నేను గమనించి ఆ మార్గంలో ముందుకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నానని సుమంత్ అశ్విన్ అన్నారు.

నాతో సినిమాలను నిర్మించి నాన్న నష్టపోయారని చాలామంది భావిస్తారని అయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదని సుమంత్ అశ్విన్ కామెంట్లు చేశారు. నాన్న నాతో ఒక్క సినిమాను కూడా నిర్మించలేదని నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికే నాన్న నిర్మాతగా నష్టపోయారని అయన తెలిపారు. నాన్న కొత్త హీరోతో వాన సినిమా తెరకెక్కించగా ఆ సినిమా వల్ల నష్టాలు వచ్చాయని సుమంత్ అశ్విన్ పేర్కొన్నారు.

ప్రభాస్ తో నిర్మించిన పౌర్ణమి సినిమా కోసం భారీ మొత్తం ఖర్చు చేశామని ఆ సినిమాకు ప్రశంసలు దక్కినా సినిమా కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోలేదని సుమంత్ అశ్విన్ తెలిపారు. పౌర్ణమి సినిమా నాన్నను పెద్ద దెబ్బ కొట్టిందని ఆ సినిమాకు వచ్చిన నష్టాలు నాన్న కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపాయని సుమంత్ అశ్విన్ తెలిపారు. సుమంత్ అశ్విన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus