హీరో సుమంత్ తన మొదటి సంపాదన గురించి చేసిన కామెంట్స్..!

అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్.. హీరోగా అయితే ప్రూవ్ చేసుకున్నాడు కానీ..స్టార్ స్టేటస్ ను దక్కించుకోవడంలోనూ అలాగే మార్కెట్ ను పెంచుకోవడంలోనూ ఇంకా వెనుకపడే ఉన్నాడు. అప్పుడప్పుడు డీసెంట్ హిట్లను అందుకుంటున్నాడు కానీ.. ఆ ఫామ్ ను మాత్రం కంటిన్యూ చేయలేకపోతున్నాడు.అయితే మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను మాత్రం చేస్తూనే వస్తున్నాడు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ప్రయోగాలు చెయ్యడం మాత్రం మానను..

అంటూ ముందుకు సాగుతున్న ఈ హీరో తాజాగా.. ‘కపటదారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదివరకటితో పోలిస్తే ఈ చిత్రాన్ని కాస్త ఎక్కువగానే ప్రమోట్ చేసాడు సుమంత్. దాదాపు అన్ని ఛానెల్స్ వారికి ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చాడు. ఇదిలా ఉండగా.. తాజాగా తన మొదటి సంపాదన గురించి కూడా తెలియజేసాడు. సుమంత్.. రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ‘ప్రేమ కథ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రాన్ని ‘అన్నపూర్ణ స్టూడియోస్’ పై సుమంత్ మేనమామ అక్కినేని నాగార్జునే నిర్మించారు.

మొదటి చిత్రం కాబట్టి.. ఆ సినిమాకి పారితోషికం అడగలేదట సుమంత్. ఒకవేళ లాభాలు వస్తే వాటా తీసుకుంటాను అని చెప్పాడట. కానీ సినిమా ప్లాప్ అయ్యింది. ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే తరువాతి సినిమా ‘యువకుడు’ ని కూడా సుధాకర్ రెడ్డితో కలిసి నాగార్జునే నిర్మించారు.కరుణాకరణ్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఈ చిత్రానికి గాను సుమంత్ కు రూ.5 లక్షల పారితోషికాన్ని ఇచ్చాడట నాగార్జున. చాలా కటింగ్ లు చేసుకుని మరీ రూ.5 లక్షలు ఇచ్చినట్టు సుమంత్ తెలిపాడు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus