Sumanth: నేను ఆ హీరో ఒకే జెనరేషన్ హీరో సుమంత్!

అక్కినేని నట వారసుడిగా ఆయన పోలికలతో ఇండస్ట్రీకి పరిచయమైన సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నా మంచి హిట్లనైతే సంపాదించుకోలేదు. అక్కినేని గ్లామర్, నటన రెండూ ఉన్నా కథల ఎంపికలో తడబడి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదు. ఈ మధ్య కాలంలో అడపా దడపా క్యారెక్టర్ రోల్స్ అలానే హీరోగా కథ నచ్చినట్టు సినిమాలను చేస్తూ అలరిస్తున్న సుమంత్ తన తాత బయో పిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలను చేసారు.

ఇటీవల ఇంటర్వ్యూలో సుమంత్ (Sumanth) మాట్లాడుతూ ఏఎన్ఆర్ బయో పిక్ గురించి ప్రశ్న ఎదురుకాగా నేనే చేయాలి, నాకు అనుభవం కూడా ఉంది అంటూ చెప్పారు సుమంత్. మహానాయకుడు, కథనాయకుడు సినిమాల్లో నాగేశ్వరావు గారి లాగా సుమంత్ కనిపించారు. అయితే వయసు రీత్యా బయో పిక్ లో నాగేశ్వరావు గారిని చూపించాలని అనుకున్నపుడు నాగార్జున గారు నేను, నాగచైతన్య చేస్తే బాగుంటుంది అంటూ చెప్పారు. ఇక ఈ జనరేషన్ లో నచ్చిన నటుడు ఎవరంటే జనరేషన్ అంటే ఎవరు, అందులో ఉన్నది ఏ హీరోలో చెప్పాలి.

ఎందుకంటే నేను, మహేష్, పవన్, ఎన్టీఆర్ ఒక జనరేషన్ వాళ్లం అంటూ చెప్పారు. నాకు మా జనరేషన్ లో మహేష్ నచ్చుతాడు. మహేష్ కాకుండా అంటే ఎన్టీఆర్ నటన నచ్చుతుంది, తాను ఆల్ రౌండర్ తన సినిమాలను చూస్తుంటాను అంటూ చెప్పారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కూడా వారసత్వం కొనసాగుతూనే ఉంటుంది. అయితే వారి నటన నైపుణ్యం వల్ల ఇండస్ట్రీలో హవా కొనసాగుతుంది. మరికొందరు వారు తీసుకునే నిర్ణయాల వల్ల ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు.

అలాంటి వారిలో అక్కినేని వారసుడు కూడా ఉన్నారని చెప్పవచ్చు. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం మొదటి వారసుడిగా ప్రేమకథా చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన సుమంత్ ఒక్క హిట్ కూడా అందుకోలేకుండా పోయాడు. ఒకవైపు ఏఎన్ఆర్ మనవడిగా మరొకవైపు నాగార్జున మేనల్లుడిగా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకోలేక పోయారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus