నారా రోహిత్ ఆగస్టు 27న ‘సుందరకాండ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెస్ చేయడంతో మొదట సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. మొదటి రోజు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో మొదటి రోజు పండగ హాలిడేతో మంచి ఓపెనింగ్స్ తీసుకుంది. కానీ 2వ రోజు నుండి డౌన్ అయ్యింది.
వీకెండ్ కు మళ్ళీ సెట్ అవుతుంది అనుకుంటే… అలాంటిదేమీ జరగలేదు. శని, ఆది వారాల్లో కూడా ఈ సినిమా సత్తా చాటలేకపోయింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.70 cr
సీడెడ్
0.17 cr
ఆంధ్ర(టోటల్)
0.54 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)
1.41 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.13 cr
ఓవర్సీస్
0.21 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
1.75 cr (షేర్)
‘సుందరకాండ’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా రూ.1.75 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.95 కోట్లను కలెక్ట్ చేసింది.బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.75 కోట్ల షేర్ ను రాబట్టాలి. అంటే ఇప్పటివరకు సగం టార్గెట్ మాత్రమే ‘సుందరకాండ’ రీచ్ అయ్యిందన్న మాట. వీకెండ్ గట్టిగా నిలబడితేనే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉంటుంది. మరి ఆ టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో చూడాలి