Sundeep Kishan: ఆయన కోసం రాసుకున్న క్యారెక్టర్‌ సందీప్‌ కిషన్‌కి ఇచ్చేశారట.. ఎందుకో?

తెలుగు, తమిళం అంటూ ఇటు అటు తిరుగుతున్నా సరైన విజయం అందుకోని హీరో ఎవరన్నా ఉన్నారా? అంటే అది కచ్చితంగా సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) అనే చెప్పాలి. వరుసగా ఏదో ఒక సినిమా చేస్తున్నా ఆయన విజయాలు రావడం లేదు. అలా అని సినిమా ఛాన్స్‌లూ ఆగడం లేదు. తాజాగా ఈ విషయం గురించి సందీప్‌ కిషన్‌ స్పందించారు. దాంతోపాటు ‘రాయన్‌’ (Raayan) గురించి కూడా చెప్పాడు. సినిమాలో తాను హీరోనా? విలనా? ఎంతసేపు కనిపిస్తాడను? అనే విషయాలు పట్టించుకోను అని.

కేవలం నటించడం మాత్రమే తన పని అని చెప్పాడు సందీప్‌. అలా చేసిన ‘రాయన్‌’ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది అంటున్నాడు. ధనుష్‌కి  (Dhanush)  50వ సినిమాగా రూపొందిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులో సందీప్‌ పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది. ‘కెప్టెన్‌ మిల్లర్‌’ సినిమా తర్వాత ధనుష్‌ ఫోన్‌ చేసి ‘రాయన్‌’ గురించి చెప్పాడు. నా కోసం రాసుకున్న పాత్ర ఇది. నువ్వు చేయాలి అని అన్నాడు.

మరో మాట చెప్పకుండా ఓకే చెప్పేశా. తన కోసం రాసుకున్న పాత్రను నాకు ఇచ్చాడంటే అది నాకు దక్కిన ప్రశంసే కదా అన్నాడు సందీప్‌. భావోద్వేగాలు, యాక్షన్‌, హాస్యం ఇలా తన పాత్రలో చాలా కోణాలు ఉన్నాయి అని చెప్పాడు. నా పని నేను సరిగ్గా చేస్తే ప్రేక్షకులకు చేరువవుతాను అని నమ్ముతాను. గత 14 ఏళ్లుగా అదే చేస్తున్నాను కూడా. నేను చేసిన సినిమాల్ని ఫ్లాప్‌ అంటుంటారు. అయితే వాటి వసూళ్లు చూస్తే అలా అనిపించదదు.

ఒకవేళ నిజంగా అన్ని ఫ్టాప్‌లు ఉంటే ఇన్ని సినిమా ఛాన్స్‌లు రావు కదా. ఫ్లాప్‌లు వచ్చినా ఇన్ని సినిమాలు వస్తున్నాయంటే కారణం ఉందనేగా అర్థం. అదే ప్రేక్షకుల ప్రేమ. అందుకే వారి కోసం కష్టపడి పని చేస్తున్నాను. నేనెప్పుడూ ప్రేక్షకులకు జవాబుదారీగా ఉంటాను అని కెరీర్‌ గురించి చెప్పాడు సందీప్‌ కిషన్‌.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus