మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) ప్రస్తుతం ‘మాస్ జాతర’ (Mass Jathara) అనే సినిమాలో నటిస్తున్నారు. భాను భోగ వరపు (Bhanu Bhogavarapu) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్నారు. దీని తర్వాత ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్లో రవితేజ ఒక సినిమా చేయబోతున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల (Kishore Tirumala) చెప్పిన కథ రవితేజకి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం రవితేజ ఫోకస్ అంతా ఈ సినిమాలపైనే ఉంది. మధ్యలో దర్శకుడు శ్రీవాస్ (Sriwass) కథకి కూడా ఓకే చెప్పారు.
‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ రవితేజతో ఆ సినిమా చేయాలని భావించింది. శ్రీవాస్ కథకి దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్ పెట్టాల్సి వస్తుందట. కానీ పీపుల్ మీడియా- శ్రీవాస్- రవితేజ అనేది డిజాస్టర్ కాంబో. ‘ధమాకా’ (Dhamaka) తర్వాత రవితేజ ‘పీపుల్ మీడియా’ లో ‘ఈగల్’ (Eagle) ‘మిస్టర్ బచ్చన్'(Mr. Bachchan) చేశాడు. 2 సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఇక ఇదే బ్యానర్లో శ్రీవాస్ ‘రామబాణం’ (Ramabanam) అనే సినిమా చేశాడు. దానికి ప్రమోషన్స్ ఖర్చులు కూడా వెనక్కి రాలేదు. అందుకే ఈ కాంబో అనేసరికి బిజినెస్ అవ్వడం కష్టం.
అందుకే ఈ కథ డిమాండ్ చేసే స్కేల్ తగ్గించి మరో హీరోతో చేయాలని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ డిసైడ్ అయ్యింది. అందుకే సందీప్ కిషన్ ను (Sundeep Kishan) ఒప్పించినట్లు తెలుస్తుంది. ఇటీవల సందీప్ ను కలిసి ఫైనల్ వెర్షన్ వినిపించాడట శ్రీవాస్. సందీప్ కూడా ఫైనల్ కాల్ ఇచ్చేశాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టుతో సక్సెస్ కొట్టడం అనేది సందీప్ కంటే శ్రీవాస్ కి చాలా ముఖ్యం. ఈ ఛాన్స్ కనుక అతను సరిగ్గా వాడుకోకపోతే.. తర్వాత అతనికి అవకాశాలు రావడం కష్టం.