Sundeep Kishan: ఆ అలవాటు ఉందంటున్న సందీప్ కిషన్!

యంగ్ హీరోలలో ఒకరైన సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ సినిమా థియేటర్లలో విడుదలై బిలో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నెటిజన్లతో ముచ్చటించిన సందీప్ కిషన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను ఒత్తిడి నుంచి బయటపడటానికి థమన్ కంపోజ్ చేసిన మాస్ పాటలను పెట్టుకుని కారులో లాంగ్ డ్రైవ్ కు వెళతానని సందీప్ చెప్పారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లాంటి కథ ఎప్పుడని నెటిజన్ అడగగా మళ్లీ ఆ సినిమా ఎందుకని కొత్త కథ చేద్దామని సందీప్ తెలిపారు.

నాగార్జున గురించి ఒక్కమాటలో చెప్పాలని నెటిజన్ ప్రశ్నించగా కొత్త దర్శకులతో, జానర్లతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మార్గదర్శకులు నాగార్జున అని సందీప్ వెల్లడించారు. సినిమాలు కాకుండా దేశాలను చుట్టిరావడం తనకు ఆసక్తి అని ప్రపంచ చరిత్రకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా చూస్తుంటానని సందీప్ కిషన్ పేర్కొన్నారు. తనకు జార్జిరెడ్డి మూవీ నచ్చిందని ఛాన్స్ వస్తే జార్జిరెడ్డి బయోపిక్ లో నటిస్తానని సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు. సాయితేజ్ ఆరోగ్యం గురించి స్పందిస్తూ సాయితేజ్ మంచి మనస్సు ఉన్న వ్యక్తి అని త్వరలోనే సాయితేజ్ ఆరోగ్యవంతుడిగా తిరిగివస్తాడని సందీప్ తెలిపారు.

తన జీవితంలో సోదరి మౌనిక ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని సందీప్ అన్నారు. గత కొన్నేళ్లలో సిస్టర్ తో బంధం మరింత బలపడిందని సందీప్ వెల్లడించారు. తనకు సిగరెట్ కాల్చే అలవాటు ఉందని మూడేళ్ల క్రితం సిగరెట్ అలవాటు కాగా త్వరలోనే మానేస్తానని సందీప్ చెప్పుకొచ్చారు. స్కూల్ డేస్ లో ఐపీఎస్ కావాలని కలలు కన్నానని సందీప్ పేర్కొన్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus