Sunil: సునీల్ విషయంలో త్రివిక్రమ్ ప్లాన్ ప్లాప్!

టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా ఒకప్పుడు చక్రం తిప్పిన సునీల్ మొదట్లో త్రివిక్రమ్ రచన అందించిన ప్రతి సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించే వాడు. త్రివిక్రమ్ సునీల్ కాంబినేషన్ లో వచ్చే ప్రతి కామెడీ రోల్ కూడా ఒక ట్రెండ్ సెట్ చేసింది అనే చెప్పాలి. నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, జై చిరంజీవ, అతడు ఇలా ప్రతి సినిమాలో కూడా సునీల్ కు చాలా మంచి కామెడీ క్యారెక్టర్లు అందించాడు త్రివిక్రమ్.

అయితే సునీల్ హీరోగా మారిన తరువాత కామెడీ పాత్రలు చేయడానికి దూరం అయిన విషయం తెలిసిందే. ఇక హీరోగా అనుకున్నంతగా నిలదొక్కుకోలేకపోయిన సునీల్ మళ్లీ ఎప్పటిలానే కామెడీ పాత్రలు చేసేందుకు యూటర్న్ తీసుకున్నాడు. కానీ త్రివిక్రమ్ తప్పితే అతనిపై ఎవరు ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు అని చెప్పాలి. ఇక త్రివిక్రమ్ కూడా సునీల్ కోసం అరవింద సమేత లో ఒక మంచి పాత్ర ఇచ్చాడు. ఆ తర్వాత అల..వైకుంఠపురములో సినిమాలో కూడా ఒక కామెడీ రోల్ చేసిన మళ్లీ బిజీ అవ్వాలి అవుతాడు అని అందరూ అనుకున్నారు.

కానీ ఆ సినిమాలేవీ కూడా అతనికి పెద్దగా హెల్ప్ చేయలేకపోయాయి. ఇక రీసెంట్ గా బిమ్లా నాయక్ సినిమాలో కూడా సునీల్ కు త్రివిక్రమ్ ఒక పాత్ర ఇచ్చాడు. కానీ అతను చేసిన సన్నివేశాలు అన్నీ కూడా ఎడిటింగ్ లోనే ఎగిరిపోయాయి. ఇక చేసేదేమిలేక త్రివిక్రమ్ సునీల్ ఒక పాటలో అలా చూపించేశాడు. సునీల్ కు మళ్లీ తనే బూస్ట్ ఇవ్వాలి అని త్రివిక్రమ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.

కానీ అవి ఏవి కూడా వర్కవుట్ అవ్వడంలేదు. ఆఖరికి భీమ్లా నాయక్ కూడా బూస్ట్ ఇవ్వలేదు. మరి రానున్న రోజుల్లో అయినా త్రివిక్రమ్ తన స్నేహితుడు సునీల్ కోసం ఇంకా మంచి పాత్రలో క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus