Jr NTR: సునిశిత్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ రేంజ్ లో చుక్కలు చూపించారా?

ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానెళ్లకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఇష్టానుసారం కామెంట్స్ చేస్తూ పరువు పోగొట్టుకుంటున్న వాళ్లలో సునిశిత్ ఒకరు. కొన్నిరోజుల క్రితం ఉపాసనపై అసభ్యంగా కామెంట్లు చేసి చరణ్ ఫ్యాన్స్ చేతిలో దెబ్బలు తిన్న సునిశిత్ ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్, ఇతర స్టార్ హీరోల గురించి నెగిటివ్ గా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ కామెంట్లు ఎన్టీఆర్ అభిమానులకు చిరాకు తెప్పించాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు కొంతకాలం పాటు అజ్ఞాతంలో ఉన్న సునిశిత్ ప్రాణ భయంతో చివరకు తారక్ కు, అతని అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

జూనియర్ ఎన్టీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పేనని సునిశిత్ అన్నారు. ఎన్టీఆర్ గారు నన్ను క్షమించండి అని సునిశిత్ చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నా తప్పును మన్నించాలని సునిశిత్ కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను, నా ఫ్యామిలీని ఇకపై ఇబ్బంది పెట్టకూడదని కోరుకుంటున్నానని సునిశిత్ అన్నారు. తాను కూడా ఈరోజు నుంచి జూనియర్ ఎన్టీఆర్ సపోర్టర్ నని థ్యాంక్స్ అని సునిశిత్ కామెంట్లు చేశారు.

సునిశిత్ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో అభిమానులు ఇకనైనా కూల్ అవుతారేమో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సునిశిత్ కు చుక్కలు చూపించారని అందుకే సునిశిత్ సైలెంట్ అయ్యాడని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సునిశిత్ ఇకనైనా సెలబ్రిటీల పేర్లతో ఇష్టానుసారం కామెంట్లు చేయడం మానేయాలని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

సునిశిత్ (Jr NTR) అనవసర వివాదాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. సునిశిత్ ఇకనైనా జాగ్రత్త పడతారో లేక అభిమానులను రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేస్తారో చూడాల్సి ఉంది. సునిశిత్ ఒకప్పుడు బాగానే ఉండేవాడని ఈ మధ్య కాలంలో అతని మానసిక స్థితి బాలేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus