Sunny Leone, Manchu Vishnu: మంచు విష్ణు సినిమా.. సన్నీ లియోన్ షాకింగ్ రెమ్యునరేషన్

మాజీ శృంగార తార సన్నీ లియోన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగా కనిపిస్తూనే ఉంటుంది. నటిగా కాకపోయినా స్పెషల్ సాంగ్స్ తో కూడా ఆమె భారీ స్థాయిలో రెస్పాన్స్ అయితే అందుకుంటోంది. గతాన్ని మర్చిపోయినా సన్నీ లియోన్ ప్రస్తుతం ఒక కొత్త దారిలో తన కెరీర్ను వెతుక్కుంటోంది. సన్నీ లియోన్ ప్రస్తుతం ఇండియాలో అయితే భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటోంది అనే చెప్పాలి. ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కసారిగా అభిమానులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడుతుంటారు.

Click Here To Watch NEW Trailer

ఇక సన్నీ కేవలం హిందీ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. అయితే ఈ బ్యూటీ తెలుగులో కనిపించి చాలా కాలం అవుతుంది. మొదట మంచు మనోజ్ తో నటించిన కరెంట్ తీగ సినిమా లో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన సన్నీ లియోన్ ఆ తర్వాత రాజశేఖర్ గరుడ వేగా సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలలో ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా సన్నిలియోన్ ఎందుకో ఒప్పుకోలేదట. ఇక ఫైనల్ గా ఆమె మంచు విష్ణు హీరోగా నటిస్తున్న గాలి నాగేశ్వరరావు అనే కొత్త సినిమాలో ఒక ఎన్నారై పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు సొంత ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఆ సినిమా లో సన్నీ లియోన్ పాత్ర చాలా ముఖ్యం అని తెలుస్తోంది. ఆమె ఈ సినిమా కోసం 20 రోజులపాటు డేట్స్ ఇచ్చినట్లుగా సమాచారం.

అయితే 20 రోజులు డేట్స్ కోసం ఆమెకు దాదాపు రెండు కోట్లకు పైగానే పారితోషకం ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్న సన్నీలియోన్ ఒక షెడ్యూల్ అనంతరం మళ్ళీ నెల రోజుల తర్వాత మరో కీలక షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో సన్నీ లియోన్ మళ్లీ తెలుగులో బిజీ అవుతుందో లేదో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus