బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా అభయహస్తం అనే టాస్క్ కంటిన్యూ అవుతోంది. ఇందులో ఐదు ఛాలెంజస్ లో ఐదుగురు విజేతలుగా నిలుస్తారని, అందుకోసం ఇద్దరిద్దరుగా ఈ ఛాలెంజస్ లో పాల్గొనాలని బిగ్ బాస్ కండీషన్ పెట్టిన సంగతి తెలిసిందే. మొదటి మూడు ఛాలెంజస్ లో షణ్ముక్, సిరి, శ్రీరామ్ చంద్రలు విజయం సాధించారు. అయితే, నాలుగో రౌండ్ కి ఎవరెవరు వెళ్తారు అనేదానిపైన డిస్కషన్స్ వేడిగా నడిచాయి.
అయితే ఫస్ట్ జెస్సీ సన్నీతో నేను డ్రాప్ అవుతానని చెప్పాడని, హెల్త్ బాగోలేదని అన్నాడని సన్నీ విశ్వ అండ్ టీమ్ తో చెప్పాడు. అయితే ఆ తర్వాత సెకండ్ రౌండ్ నుంచీ నేను కూడా పార్టిపిట్ చేస్తానని అంటున్నాడని అన్నాడు సన్నీ. సరిగ్గా టాస్క్ వచ్చే సమయానికి జెస్సీ నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పాడు. దీంతో అనీమాస్టర్ జెస్సీ కోసం నేను డ్రాప్ అవుతానని చెప్పింది. దానికి జెస్సీ ఇష్టపడలేదు. అనీమాస్టర్ ని డ్రాప్ అవ్వొద్దని చెప్పి నేను గేమ్ నుంచీ డ్రాప్ అయిపోతున్నానని మళ్లీ మనసు మార్చుకున్నాడు.
ఇక సన్నీకి పాయింట్ దొరికింది. దీంతో జెస్సీని క్లారిటీగా ఒక నిర్ణయం తీస్కోమని చెప్పాడు. నిజానికి జెస్సీ సెకండ్ రౌండ్ అయిన తర్వాత పార్టిసిపేట్ చేద్దామని అనుకున్నాడు. ఇదే విషయాన్ని గ్రూప్ డిస్కషన్ లో చెప్పాడు. గివ్ అప్ ఇవ్వను, చాలామంది కెప్టెన్ అయినవాళ్లు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, నేను ఎందుకు చేయకూడదు అంటూ మాట్లాడాడు. ఇక్కడే సన్నీ సూపర్ గా క్లారిఫికేషన్ ఇచ్చాడు. నిన్ను పార్టిసిపేట్ చేయద్దని అనట్లేదు, నువ్వే దీనిగురించి మాట్లాడావ్ అంటూ చెప్పాడు.
సన్నీ లేడీస్ లో ఎవరో డ్రాప్ అవుతారని అన్నారని అందుకే జెస్సీ మళ్లీ పార్టిసిపేట్ చేయాలని అనుకున్నాడని గ్రూప్ డిస్కషన్ లో చెప్పాడు. అప్పుడు అనీ మాస్టర్ డ్రాప్ అవుతానని చెప్పింది. కానీ, జెస్సీ దానికి ఒప్పుకోలేదు. లాస్ట్ కి సన్నీ కూడా స్వయంగా డ్రాప్ అవుతాను అని, మనస్పూర్తిగా చెప్తున్నా నువ్వు ఆడు అని అన్నాడు. కానీ, ఫైనల్ గా జెస్సీ ఐ యామ్ అన్ ఫిట్ ఒకేనా అంటూ గేమ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో అనీమాస్టర్ ఇంకా పింకీ నాలుగో ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేశారు. ఇందులో అనీమాస్టర్ విజేతగా నిలిచింది.
[yop_poll id=”4″]
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?