Bigg Boss 5 Telugu: కెప్టెన్ అవ్వకపోవడమే సన్నీకి ప్లస్ అవుతోందా..?

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ ఇప్పుడు సీజన్ 5 స్వరూపాన్ని మార్చేస్తోంది. నిజానికి లాస్ట్ 4సీజన్స్ లో 4వ వారం వచ్చేసరికి బయట ఉన్న ఆడియన్స్ ఎవరో ఒకర్ని విపరీతంగా ప్రేమిచడం అనేది మనం చూస్తునే ఉన్నాం. కానీ, సీజన్ 5లో మాత్రం ఒక్కో పార్టిసిపెంట్ కి బయట ఒక్కోరకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇందులో భాగంగానే ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి వచ్చి సన్నీకి మంచి క్రేజ్ వస్తోంది. ఓటింగ్ లో కూడా టాప్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు హౌస్ లో జరిగిన కెప్టెన్సీ టాస్క్ కూడా సన్నీని హీరోని చేసేసిందనే అంటున్నారు బిగ్ బాస్ వీక్షకులు అందరూ.

కెప్టెన్సీ టాస్క్ లో మానస్ బదులుగా సన్నీ రావడం, అలాగే హమీదాని కన్విన్స్ చేసి శ్రీరామ్, టాస్ వేసుకుని శ్వేత రావడం అనేది సన్నీకి ప్లస్ అయ్యింది. హౌస్ మేట్స్ అందరూ సన్నీ కెప్టెన్ కాకుడదని వ్యతిరేకిస్తూ కత్తితో పోట్లు పొడిచారు. ముఖ్యంగా విశ్వ, సిరి, షణ్ముక్, నటరాజ్, ప్రియా ఈ ఐదుగురూ కత్తిపోట్లు సన్నీని బాగా కుంగదీశాయి. అంతేకాదు, విశ్వ, సిరిలు చెప్పిన రీజన్స్, లోబో పొడినపుడు కలిగిన ఫీలింగ్ ఇవన్నీ కూడా సన్నీని బాధపెట్టాయి. దీంతో సన్నీ వాళ్లు చెప్పిన రీజన్స్ అన్నింటికీ ఆన్సర్ ఇచ్చాడు. ముఖ్యంగా విశ్వకి, సిరికి కౌంటర్ వేశాడు.

ఆ తర్వాత హౌస్ లో రవి, ప్రియాంకలు కూడా సన్నీనే కసితీరా పొడిచారు. కెప్టెన్ అవ్వాలంటే కమాండింగ్ ఉండాలని రవి అంటే, మీరు ఆవేశం తగ్గించుకుంటే బాగుంటుందన్నయ్యా అంటూ పింకీ చెప్పింది. దీంతో కెప్టెన్ అవ్వకపోయినా కత్తిపోట్లు ఎక్కువ తిన్నందుకు సన్నీకి బాగా ప్లస్ అయ్యింది. ఇక ఆతర్వాత కాజల్ ఫస్ట్ నీకు సపోర్ట్ చేయకూడదు అని అనుకున్నాను అని, కానీ ఇన్న కత్తిపోట్లు చూసిన తర్వాత నాకు పెయిన్ గా ఉందని ఫీల్ అవుతూ శ్వేతని పొడిచింది కాజల్. దీంతో శ్రీరామ్ హౌస్ కెప్టెన్ గా అయ్యే ఛాన్స్ దొరికింది. లాస్ట్ లో అనీమాస్టర్, జెస్సీ ఇద్దరూ శ్రీరామ్ ని పొడిచినా కూడా తక్కువ కత్తిపోట్లతో శ్రీరామ్ కెప్టెన్ అయ్యాడు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus