Bigg Boss 5 Telugu: రవి కావాలనే సన్నీని టార్గెట్ చేసి సిరిని గెలిపించాడా..?

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో ట్విస్ట్ లు ఎక్కువయ్యాయి. ఫస్ట్ పవర్ రూమ్ యాక్సెస్ సంపాదించిన మానస్ ఆ పవర్ టూల్ ని సన్నీకి ఇచ్చాడు. సన్నీ ఆ పవర్ తో సిరి దగ్గర సగం బంగారు ముత్యాలని తీస్కుని షణ్ముక్ కి ఇచ్చాడు. దీంతో లెక్క సరిపోయింది. లాస్ట్ టైమ్ వీళ్ల మద్యలో వచ్చిన ఘర్షణకి ఇది చెల్లు చీటి అయ్యింది. ఇదే విషయాన్ని మానస్ కూడా చెప్పాడు. ఇక రెండో ఛాలెంజ్ లో సిరి ఇంకా సన్నీలు పాల్గొనాల్సి వచ్చింది. ఇక్కడే స్మిమ్మింగ్ పూల్ టాస్క్ వచ్చేసరికి సిరి పార్టిసిపేట్ చేయడానికి కష్టంగా మారింది.

తనకి ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్ ని రవి బిగ్ బాస్ కి చెప్పాడు. దీంతో బిగ్ బాస్ సిరి బదులుగా ఎవరినైనా ఎంచుకోవచ్చని సిరికి చెప్పాడు బిగ్ బాస్. దీంతో షణ్ముక్ సలహాతో సిరి మానస్ ని ఎంపిక చేసింది. సన్నీ వర్సెస్ మానస్ ఆడుతున్న ఛాలెంజ్ హౌస్ మేట్స్ కే కాకుండా ఆడియన్స్ లో కూడా ఆసక్తిని రేకెత్తిచింది. ఇక్కడే స్మిమ్మింగ్ పూల్ లో స్మిమ్ చేస్తూ అవతల ఉన్న టీషర్ట్స్ ని ధరించి మళ్లీ తిరిగి స్టార్టింగ్ పాయింట్ కి రావాలి. ఈ టాస్క్ లో ఎవరు ఎక్కువ టీషర్ట్స్ ధరిస్తే వాళ్లు విజేత. ఇక్కడే ఇద్దరూ పోటాపోటీగా గేమ్ మొదలుపెట్టారు.

సంచాలక్ గా ఉన్న రవి రెండు మూడు టీషర్ట్స్ ధరించిన తర్వాత మధ్యలో టీషర్ట్స్ ప్రోపర్ గా వేస్కోవాలని రూల్ పెట్టాడు. దీనికి పక్కనే ఉన్న షణ్ముక్ అవి రివర్స్ ఉండకూడదు అన్నాడు. సన్నీకి ఒళ్లు మండింది. అప్పటికే ఆల్రెడీ కొన్ని టీషర్ట్స్ ని వేసేసుకున్నాడు సన్నీ. లేబుల్ కనిపించడం లేదని, అలాంటపుడు రివర్స్ లో ఉన్నవి ఎలా వేస్కుంటామంటూ వాదనకి దిగాడు. ఫస్ట్ సంచాలక్ ఈ రూల్ చెప్పలేదని, మధ్యలో చెప్తే ఎలా అంటూ సంచాలక్ రవిని నిలదీశాడు. ఎప్పుడూ నాకే ఇలా జరుగుతుంది. ఆడాలన్న మూడ్ కూడా పోయింది అంటూ అప్సెట్ అయ్యాడు. కాజల్ కూడా సన్నీకి ఎక్స్ ప్లయిన్ చేసే ప్రయత్నం చేసింది, అయినా కూడా సన్నీ ఓడిపోయాడు కాబట్టి వినే మూడ్ లో లేడు.

ఆ తర్వాత సంచాలక్ నిర్ణయం కాబట్టి యాక్సెప్ట్ చేశానని, కానీ నాకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చాడు.నిజానికి రవి లాస్ట్ వీక్ వీకెండ్ ఎపిసోడ్ లో సన్నీ బిహేవియర్ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత సన్నీ రవిని ఫేక్ అంటూ బోర్డ్ తగిలించాడు. వీరిద్దరికీ మధ్యలో కోల్డ్ వార్ నడూస్తూనే ఉంది. ఇప్పుడు సంచాలక్ గా రవి తీస్కున్న నిర్ణయాన్ని తప్పుబట్టాడు సన్నీ. ఇక్కడే రవి కావాలనే సన్నీని టార్గెట్ చేశాడని, అందుకే టాస్క్ మధ్యలో ఈ రూల్ పెట్టాడని అంటూన్నారు నెటిజన్స్. సన్నీ ఫ్యాన్స్ గ్రూప్స్ లో ఈ వీడియో క్లిప్ ని తెగ షేర్లు చేస్తున్నారు. అంతేకాదు, తన ఫ్రెండ్ అయిన సిరిని గెలిపించేందుకే ఇలా సన్నీకి రూల్ పెట్టి ఆపేశాడని, కూడా కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Share.