‘విజేత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్… ఆ చిత్రంతో పెద్దగా అలరించలేకపోయాడు. అయితే ఈసారి ఎలా అయినా హిట్టు కొట్టాలని ‘సూపర్ మచ్చి’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై రిజ్వాన్ నిర్మించారు. రచితా రామ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సంక్రాంతికి అంటే జనవరి 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
ఈ చిత్రం పై పెద్దగా బజ్ లేదు. మెగా ఫ్యామిలీ నుండీ ఎవ్వరూ కూడా ఈ చిత్రాన్ని పుష్ చేసే ప్రయత్నం చేయడం లేదు. మొన్న విడుదల చేసిన ట్రైలర్ కూడా పెద్ద ఆసక్తిని కలిగించలేకపోయింది. దాంతో బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. ఒకసారి ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం
0.45 cr
సీడెడ్
0.20 cr
ఆంధ్రా(టోటల్)
0.60 cr
ఏపి+తెలంగాణ (టోటల్)
1.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.07 cr
ఓవర్సీస్
0.05 cr
వరల్డ్ వైడ్ టోటల్
1.37 cr
‘సూపర్ మచ్చి’ చిత్రాన్ని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు నిర్మాతలు. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.1.45 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప… ఈ కోవిడ్ థర్డ్ వేవ్ టైములో.. అదీ ‘బంగార్రాజు’ ‘రౌడీ బాయ్స్’ ‘హీరో’ వంటి చిత్రాల పోటీ నడుమ గట్టెక్కడం చాలా కష్టమనే చెప్పాలి.