Super Machi Collections: మెగా హీరో సినిమా.. కనీసం నిలబడేలా లేదు..!

‘విజేత'(2018) చిత్రంతో హీరోగా పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్… ఆ చిత్రంతో పెద్దగా అలరించలేకపోయాడు. అయితే ఈసారి ఎలా అయినా హిట్టు కొట్టాలని ‘సూపర్ మచ్చి’ చేసాడు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌ పై రిజ్వాన్ నిర్మించారు. రచితా రామ్ హీరోయిన్ గా నటించింది.అయితే ఈ చిత్రం పై మొదటి నుండీ కొంచెం కూడా బజ్ లేదు.

మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఈ చిత్రం గురించి ఎక్కడా ఒక్క ట్వీట్ వేసిన దాఖలాలు కూడా లేవు.ఇక టాక్ కూడా జనాలను థియేటర్లకు రప్పించే విధంగా లేకపోవడంతో కలెక్షన్లు కూడా దారుణంగా నమోదు అయ్యాయి. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం  0.13 cr
సీడెడ్  0.06 cr
ఆంధ్రా(టోటల్)  0.08 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  0.27 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
 0.02 cr
వరల్డ్ వైడ్ టోటల్  0.29 cr

‘సూపర్ మచ్చి’ చిత్రాన్ని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.1.45 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ ఫస్ట్ వీకెండ్ కు ఈ చిత్రం కేవలం రూ.0.29 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం విడుదలైన రెండో రోజు నుండీ అంటే జనవరి 15 నుండీ చాలా థియేటర్లలో ‘అఖండ’ ని ప్రదర్శించారు. అంటే ‘సూపర్ మచ్చి’ రన్ దాదాపు క్లైమాక్స్ కు వచ్చేసినట్టే..!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus