టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు డ్యూయల్ రోల్ లో నటించిన సినిమాలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బాలయ్య (Nandamuri Balakrishna) హీరోగా తెరకెక్కిన మెజారిటీ సినిమాలలో బాలయ్య డ్యూయల్ రోల్ లోనే నటించిన సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు ట్రిపుల్ రోల్స్ లో నటించిన సందర్భాలు తక్కువగా ఉన్నాయి. చిరంజీవి (Chiranjeevi) ముగ్గురు మొనగాళ్లు (Mugguru Monagallu) , బాలయ్య అధినాయకుడు (Adhinayakudu) , జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) జై లవకుశ (Jai Lava Kusa) సినిమాలో ట్రిపుల్ రోల్ లో నటించారు.
Krishna
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో ట్రిపుల్ రోల్స్ సినిమాలలో నటించిన హీరో కృష్ణ (Krishna) కావడం గమనార్హం. కృష్ణ ఏకంగా ఏడు సినిమాలలో ట్రిపుల్ రోల్స్ లో నటించి మెప్పించారు. ఈ రికార్డు ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ కొంతమంది హీరోలు డ్యూయల్ రోల్ లో నటించలేదు. మరోవైపు స్టార్ హీరోలు రెండేళ్లకు లేదా మూడేళ్లకు ఒక సినిమాలో నటిస్తున్నారు.
అందువల్ల టాలీవుడ్ స్టార్స్ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో ట్రిపుల్ రోల్స్ లో నటించడం అసాధ్యమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టాలీవుడ్ స్టార్ హీరోలు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా ట్రిపుల్ రోల్స్ సినిమాలపై దర్శకులు సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ట్రిపుల్ రోల్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన సందర్భాలు కూడా లేవు.
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎంతమంది హీరోలు రాబోయే రోజుల్లో ట్రిపుల్ రోల్స్ లో నటిస్తారో చూడాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయని తెలుస్తోంది. ట్రిపుల్ రోల్స్ అంటే ఒకింత రిస్క్ అని కొంతమంది హీరోలు ఈ తరహా ప్రాజెక్ట్ లపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం అందుతోంది. టాలీవుడ్ స్టార్స్ సినిమాలు ఇతర భాషల ప్రేక్షకులను సైతం మెప్పిస్తున్నాయి.