Rajinikanth: సూపర్ స్టార్ ఫోన్ కాల్ తో మురిసిపోయిన రక్షిత్ శెట్టి!

కిరిక్ పార్టీ ఫేమ్ రక్షిత్ శెట్టి నటుడిగా కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా కన్నడనాట మంచి గుర్తింపు సంపాదించుకున్న రక్షిత్ శెట్టి ఇతర భాషలలో కూడా గుర్తింపు పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటించిన 777 చార్లీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, కన్నడ, హిందీ భాషలలో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

777 చార్లీ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ఒక మనిషికి కుక్కకు మధ్య ఉన్న ఎమోషన్ ని ఎంతో అద్భుతంగా చూపించడంతో ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమాకు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.ఇక ఈ సినిమా చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు థియేటర్లోనే కంటతడి పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

తాజాగా 777 చార్లీ సినిమా చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఏకంగా హీరో రక్షిత్ శెట్టికి ఫోన్ చేసి సినిమా ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా హీరో రక్షిత్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా చూసి తనకు ఫోన్ చేశారని, సినిమా మేకింగ్, క్వాలిటీ.. తెరకెక్కించిన విధానం.. క్లైమాక్స్ డిజైన్ చేసిన విధానం అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ఆధ్యాత్మిక కోణంలో క్లైమాక్స్ తెరకెక్కించడం బాగుందనీ రజనీకాంత్ సినిమా పై ప్రశంసలు కురిపించినట్టు రక్షిత్ వెల్లడించారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ సర్ నుంచి ఇలాంటి మాటలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉందనీ రక్షిత్ ఎంతో సంబరపడుతూ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఈ క్రమంలోనే రజనీకాంత్ సర్ కి ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేయడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అన్ని భాషలలోనూ మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేశారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus