Superstar Krishna: మేకప్ లేకుండా కృష్ణ నటించి సక్సెస్ సాధించిన మూవీ ఇదే!

సూపర్ స్టార్ కృష్ణ మరణం అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. కృష్ణతో గడిపిన క్షణాలను తలచుకుంటూ ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎమోషనల్ అవుతున్నారు. కృష్ణ పార్థివదేహాన్ని చూసి మహేష్ బాబు ఎంతగానో ఎమోషనల్ అయ్యారు. అయితే ఒక సినిమాలో మాత్రం కృష్ణ మేకప్ లేకుండా నటించడంతో పాటు సక్సెస్ సాధించడం గమనార్హం. కృష్ణ నటించిన ఆ సినిమా సాక్షి కాగా ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది.

తేనె మనసులు సినిమాతో కృష్ణ హీరోగా పరిచయం కాగా ఈ సినిమా సక్సెస్ కృష్ణ కెరీర్ కు ప్లస్ అయింది. సాక్షి సినిమా బాపు డైరెక్షన్ లో తెరకెక్కగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో పల్లెటూరి అమాయకుడి పాత్రలో నటించిన కృష్ణ తన నటనతో మెప్పించారు. కృష్ణ, విజయనిర్మల కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి మూవీ ఇదే కావడం గమనార్హం. కృష్ణ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు గోదావరి జిల్లాలలో షూటింగ్ ను జరుపుకున్నాయి.

అభిమానులకు కృష్ణ ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. కృష్ణ మూవీ షూటింగ్ జరుగుతుందంటే వేల సంఖ్యలో అభిమానులు ఆయనను చూడటానికి పడిగాపులు కాసేవారు. అప్పట్లో తనను చూడటానికి వచ్చిన అభిమానులకు కృష్ణ భోజనాలు ఏర్పాటు చేయించడం గమనార్హం. తన సినిమాలు సక్సెస్ అయిన సమయంలో కృష్ణ అభిమాన సంఘం నాయకులకు ఖరీదైన బహుమతులను గిఫ్ట్ గా ఇచ్చేవారు.

కృష్ణ అభిమానులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కృష్ణ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా జరుపుకునే వాళ్లమని తెలిపారు. కృష్ణను ఎప్పుడు కలిసినా ఆయన ఆప్యాయంగా పలకరించేవారని ఫ్యాన్స్ చెబుతున్నారు. పద్మాలయ స్టూడియోలో కృష్ణ అభిమానులను ప్రత్యేకంగా కలిసేవారని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus