మహేష్ చేసిన ఆ సినిమా ప్లాప్ అవుతుంది అని కృష్ణకి ముందే తెలుసా?

  • November 19, 2022 / 01:22 PM IST

సూపర్ స్టార్ కృష్ణ గారు ఇటీవల హార్ట్ స్ట్రోక్ తో మరణించారు. ఆయన మరణం ఘట్టమనేని ఫ్యామిలీకి తీరని లోటు అనే చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త మార్పులు తీసుకొచ్చి తెలుగు సినిమా ఖ్యాతి గురించి దేశం నలుమూలల మాట్లాడుకునేలా చేశారు కృష్ణ గారు. దాదాపు 345 చిత్రాల్లో నటించిన కృష్ణ గారు.. ఏ సినిమా ఎంతవరకు ఆడుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది పర్ఫెక్ట్ గా అంచనా వేయగలరు. కృష్ణ గారు సినిమాల ద్వారా సంపాదించుకున్నది ఎక్కువగా ఏమీ లేదు.

కానీ ఆయన పేరు మాత్రం సువర్ణాక్షరాలతో రాయతగినది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉండగా.. రమేష్ బాబుని హీరోగా నిలబెట్టడంలో ఫెయిల్ అయిన కృష్ణ గారు మహేష్ బాబు విషయంలో చాలా శ్రద్ధ వహించారు. అయితే కెరీర్ ప్రారంభంలో మహేష్ సొంత నిర్ణయాలు తీసుకుని ఫెయిల్ అయిన సందర్భాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా మహేష్ కు స్టార్ ఇమేజ్ వచ్చాక కూడా ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నాడు.

‘ఒక్కడు’ సినిమా తీసిన తర్వాత మహేష్ నుండి ‘నిజం’ ‘నాని’ వంటి సినిమాలు వచ్చాయి. ‘నిజం’ అనే మూవీ ‘ఒక్కడు’ కంటే ముందే విడుదలవ్వాలి. కానీ లేట్ అవ్వడంతో ‘ఒక్కడు’ తర్వాత వచ్చింది. ఇదిలా ఉండగా.. మహేష్ ‘నాని’ సినిమాలో నటిస్తున్నాడు అనే విషయం కృష్ణ గారికి తెలుసు కానీ ఆ సినిమా కథ గురించి మొదట కృష్ణ గారికి తెలీదట. అయితే ‘నాని’ సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత కృష్ణ గారు మహేష్ తో ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారట.

తర్వాత మహేష్.. కృష్ణ గారిని ఆరా తీస్తే.. ‘ఈ సినిమా(నాని) హిట్ అయితే మహేష్ స్టార్ కాదు. ఈ సినిమా ప్లాప్ అయితే మహేష్ స్టార్’ అని చెప్పారట. తర్వాత ‘నాని’ సినిమా ప్లాప్ అని తేలింది. కొన్నాళ్ల తర్వాత మహేష్ కు అర్ధమైందట.. కృష్ణ గారు ఎందుకు అలా చెప్పారు అనేది..! ‘ప్రయోగాలు స్టార్ హీరోలు చేస్తే సక్సెస్ రాదు.. ఒకవేళ సక్సెస్ వస్తే ఆ హీరో స్టార్ హీరో కాదు’ అనేది కృష్ణగారి మాటల్లోని సారాంశం అని ఆలస్యంగా అర్థం చేసుకున్నట్టు మహేష్ ఓ సందర్భంలో తెలిపాడు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus