సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ నెల 31న పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తను అంగీకరించిన ‘అన్నాత్తే’ సినిమాను త్వరగా పూర్తి చేయాలని అహర్నిశలు పని చేశారు. వీలైనంత తొందరగా సినిమాను పూర్తి చేసి రాజకీయాలపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రోజుకి 14 గంటల పాటు షూటింగ్ లో పాల్గొన్నారు. దీంతో శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు. దాంతో ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం ఈ నెల 13న హైదరాబాద్ కి వచ్చిన ఆయన అస్వస్థతకు గురయ్యారు.
బీపీ పెరిగిపోవడంతో జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడిన తరువాత చెన్నైకి పయనమయ్యారు. ఈ క్రమంలో రాజకీయాలు, పార్టీ పనులు అంటూ నిత్యం అదే ఆలోచనతో ఉండటం వల్లే మానసిక ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి గురయ్యారని, ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని రజినీకాంత్ కూతుళ్లు ఆయన్ని కోరినట్లు తెలుస్తోంది. చాలా మంది అభిమానులు, రాజకీయ మిత్రులు రజినీకాంత్ తో కలిసి పని చేయాలని అనుకుంటున్నారు.
మరి ఆయన ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..? పార్టీని ప్రకటిస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉండగా.. వారం రోజుల పాటు రజినీకాంత్ ను విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. శారీరక, మానసిక ఒత్తిడికి గురయ్యే పనులకు దూరంగా ఉండాలని.. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. దీంతో రజినీ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!