Actress Sreeleela: వివాదంలో చిక్కుకున్న ‘పెళ్ళిసందD’ హీరోయిన్ శ్రీలీల..!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి ఫ్యాక్టరీ నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పెళ్ళి సందD’.గౌరీ రోనంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ కొడుకు రోషన్, శ్రీలీల జంటగా నటించారు. దసరా పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ అయితే రాలేదు కానీ ఓపెనింగ్స్ అయితే బాగానే నమోదయ్యాయి. ఈ సినిమా పై క్రేజ్ ఏర్పడడానికి ముఖ్య కారణం హీరోయిన్ శ్రీలీల మరియు పాటలు అన్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ కు హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో శ్రీలీల భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ గా రాణించే అవకాశాలు ఉన్నాయని అంతా అభిప్రాయపడ్డారు.

ఈమె తెలుగమ్మాయే అయినప్పటికీ కన్నడలో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు డాక్టర్ చదువుతుంది. అయితే అనుకోని విధంగా శ్రీలీల ఇప్పుడు వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశం అయ్యింది. విషయంలోకి వెళితే.. హీరోయిన్ శ్రీలీల నా కూతురు కాదు… నా ఇంటిపేరుని వాడుకునే అరహత లేదంటూ ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకర రావు మండిపడ్డారు. “శ్రీలీల నా కూతురంటూ జరుగుతున్న ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను. సూరపనేని ఫౌండేషన్ పేరుతో ఇన్విటేషన్ కార్డ్ క్రియేట్ చేసి అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. శ్రీలీల నా మాజీ భార్య కూతురు.

నేను నా మాజీ భార్యతో విడిపోయిన తరువాత ఆమెకు జన్మించింది. నా ఆస్తుల పై క్లైమ్ చేయడానికి నా ఇంటి పేరుని వాడుతున్నారు. ఈ విషయం పై లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. నా విడాకుల పై ఉన్న కేసు ఇంకా నడుస్తుంది. హైకోర్టు నుండీ సుప్రీం కోర్టు వరకు నేను తిరుగుతున్నాను. అలాగే.. శ్రీలీల నా కూతురంటూ జరుగుతున్న ప్రచారంపై నేను సూరపనేని సొసైటీ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది” అంటూ అతను చెప్పుకొచ్చాడు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus