Surekha Vani: మీ అమ్మాయికి పెళ్లి అయ్యేవరకు కాస్త ఆగండి ఆంటీ?

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో తల్లి, వదిన, అక్క, పిన్ని పాత్రలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సురేఖవాణి సినిమాలలో చీరలు కట్టి ఎంతో సాంప్రదాయ బద్దంగా కనిపిస్తారు. అయితే ఈమె రీల్ జీవితం నుంచి రియల్ జీవితంలోకి వచ్చేసరికి పొట్టి దుస్తులు ధరిస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తుంటారు

నాలుగు పదుల వయసులో కూడా సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి పొట్టి దుస్తులు ధరిస్తూ నిత్యం డాన్స్ వీడియోలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ పెద్దఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా వీరు చేసే రచ్చ కొన్నిసార్లు దారుణమైన ట్రోలింగ్ కు దారితీస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా సురేఖవాణి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు.

ఈ వీడియోలో భాగంగా అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా నుంచి తెలుసా.. తెలుసా ప్రేమించానని అనే పాటకు లిప్ సింక్ చేస్తూ ఉయ్యాలలూగుతూ ఉన్నటువంటి వీడియోని షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారడమే కాకుండా పెద్ద ఎత్తున నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఏజ్ లో మీకు ఈ సాంగ్ అవసరమా అంటూ పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరైతే ఏకంగా.. ఆంటీ మీ కూతురు పెళ్లి అయ్యే వరకు ఆగండి..లేదంటే మీ అమ్మాయిని చూడటానికి వచ్చిన వాడు మీ అమ్మాయికి బదులుగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారంటూ కొందరు ఈ వీడియో పై విమర్శలు చేయగా మరికొందరు మాత్రం సూపర్ నైస్ సాంగ్ అంటూ తన వీడియో పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus