కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీపై ఎంతగా ప్రభావం చూపిందో తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా నిర్మాతలంతా నష్టాలు చవిచూశారు. ఈ క్రమంలో నిర్మాత సురేష్ బాబు కూడా ఇబ్బంది పడ్డారు. ఆయన నిర్మిస్తోన్న ‘విరాటపర్వం’, ‘నారప్ప’ సినిమాలు షూటింగ్ లు ఆగిపోవడంతో పాటు.. కీలకమైన థియేటర్ బిజినెస్ కూడా నిలిచిపోవడంతో ఆయన భారీగా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తన నష్టాల నుండి బయటపడడానికి సురేష్ బాబు ఒక బిజినెస్ ప్లాన్ వేశారు.
తన రెండు సినిమాలను కాంబో ప్యాక్ మాదిరి అమ్మకానికి పెట్టాలనుకుంటున్నారట. ‘నారప్ప’, ‘విరాటపర్వం’ సినిమాలను కాంబో ప్యాక్ కింద శాటిలైట్ రైట్స్ అమ్మాలనేది సురేష్ బాబు ప్లాన్. ‘నారప్ప’ సినిమాను కళైపులి ఎస్.థానుతో కలిసి నిర్మిస్తున్నారు. ఇక ‘విరాటపర్వం’ సినిమాను సుధాకర్ చెరుకూరితో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల శాటిలైట్ రైట్స్ ను ఏదొక ఛానెల్ కి జాయింట్ ఇచ్చేసి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. కుదిరితే హీరో రాజ్ తరుణ్ తో చేయబోయే ‘డ్రీమ్ గర్ల్’ రీమేక్ శాటిలైట్ రైట్స్ ను కూడా కలిపి ఇచ్చేయడానికి రెడీ అవుతున్నారట.
నిజానికి బయటకి నుండి ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమాలు నిర్మించాల్సిన అవసరం సురేష్ బాబుకి లేదు. తన సొంత డబ్బుతోనే సినిమాలు తీస్తుంటాడు. కావాలంటే ఇతర నిర్మాతల సినిమాలకు కూడా ఫైనాన్స్ చేసేంత కెపాసిటీ ఆయనకుంది. ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబం కాబట్టి ఆయనకి వడ్డీల సమస్య కూడా ఉండదు. అలాంటిది ఆయన రెండు సినిమాలను ఇలా బల్క్ గా అమ్మాలని ఎందుకు అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి!