టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలైన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ లలో ఎవరు పెద్ద హీరో అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఈ స్టార్ హీరోలలో ఎవరి ప్లస్ పాయింట్లు వాళ్లకు ఉన్నాయి. అయితే తాజాగా సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభాస్, పవన్, బన్నీలలో ఎవరు పెద్ద హీరో అనేది చెప్పలేం అంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Suresh Babu
ఎవరు పెద్ద హీరో అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆయన తెలిపారు. ప్రతి స్టార్ హీరోకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా కలెక్షన్లు అనేవి ఎప్పుడూ డైరెక్టర్ పై కూడా ఆధారపడి ఉంటాయని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించలేకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. అందుకే కలెక్షన్ల ఆధారంగా పెద్ద హీరోలను నిర్ణయించలేమని ఆయన అన్నారు.
టాలీవుడ్ లో పవన్ సినిమాలకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని బన్నీకి కూడా ఇలాగే ఓపెనింగ్స్ వస్తాయని ఆయన తెలిపారు. ప్రభాస్ నటించిన బాహుబలి, సలార్, కల్కి సక్సెస్ సాధించినా కొన్ని సినిమాలు నిరాశపరిచాయని సురేష్ బాబు వెల్లడించారు. పవన్ చిన్న డైరెక్టర్లతో సినిమాలు చేసినా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగని పవన్ ఏ సినిమా చేసినా ప్రేక్షకులు చూడరని ఆయన పేర్కొన్నారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో సైతం రజనీకాంత్, విజయ్, అజిత్ లలో ఎవరు పెద్ద హీరో అంటే చెప్పలేమని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. తెలుగులో 100 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించే హీరోలు చాలామంది ఉన్నారని ఆయన వెల్లడించడం గమనార్హం. స్టార్ హీరోలు సినిమాలను ఆపేస్తే లోకల్ హీరోలే స్టార్ హీరోలుగా మారతారని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. ప్రతి ఇండస్ట్రీలో ఎవరు పెద్ద హీరో అనే చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు.