Suresh Babu: అభిరామ్ సినీ ఎంట్రీ పై సురేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ‘నారప్ప’ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఆ ఒక్క రోజు మాత్రమే ‘నారప్ప’ మూవీ థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. తమిళంలో ‘అసురన్’ కు రీమేక్ గా రూపొందిన ఆ మూవీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే ఆ సినిమాకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అయితే అందులో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి..

థియేటర్లలో చూడాల్సిన మూవీ అని అభిమానులు భావిస్తున్నారు. అందుకే ఈ చిత్రాన్ని సురేష్ బాబు కూడా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీని ద్వారా వచ్చే కలెక్షన్స్ మొత్తాన్ని ఛారిటీకి ఇచ్చేస్తారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. అమెజాన్ ఇష్యూ వల్ల ‘నారప్ప’ ని ఒక్కరోజే థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. వాళ్ళ బిజినెస్ కూడా జరగాలి కాబట్టి.. అందుకు అంగీకరించినట్టు సురేష్ బాబు చెప్పుకొచ్చారు.

ఇక అభిరామ్ ఎంట్రీ గురించి సురేష్ బాబు మాట్లాడుతూ.. “నిజానికి అభిరామ్ యాక్టర్ అవుతాడని మేము అనుకోలేదు. నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. అవి చూసుకోమంటే.,. ”తాత నన్ను యాక్టర్ అవ్వమని చెప్పారు నేను యాక్టర్ అవుతా” అని అన్నాడు. కిరణ్, తేజ తో కలిసి చేస్తున్నాడు. మంచి డేట్ కోసం చూస్తున్నారు. వీఎఫ్ ఎక్స్ వర్క్ జరుగుతుంది. ఫైనల్ కాపీ చూడాలి” అంటూ చెప్పుకొచ్చారు.

అభిరామ్ సినిమాల్లోకి రాకముందే పాపులర్ అయ్యాడు. గతంలో ఓ నటి ఇతని పై ఘోరమైన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఛాన్స్ దొరికితే చాలు సురేష్ బాబుని మామ అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తుంటుంది ఆ నటి. ఆమె వల్ల అభి పేరు టాలీవుడ్లో మార్మోగింది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus