టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు.. ఐడియాలజీ చాలా బాగుంటుంది. ఆయన ఏం మాట్లాడినా 40 ఏళ్ళ అనుభవంతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన వద్ద ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. గత రెండు, మూడేళ్లుగా సినీ పరిశ్రమని పట్టి పీడిస్తున్న సమస్య ఏమైనా ఉందా అంటే అది థియేటర్ కి జనాలు వెళ్లడం లేదు అనే సమస్యే అని చెప్పాలి. ఈ సమస్య పై ఎప్పటికప్పుడు సురేష్ బాబు స్పందిస్తూనే ఉన్నారు.
తాజాగా మరోసారి ఆయన ఈ విషయం పై స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సురేష్ బాబు మాట్లాడుతూ.. “టికెట్ రేట్లు సినిమా రిలీజ్ టైంలో పెంచేసి.. తర్వాతి వారం తగ్గించడం అనేది సరైన పద్ధతి కాదు. అసలు టికెట్ రేట్లు పెంచడం, తగ్గించడం అనేది పూర్తిగా థియేటర్లకు వదిలేయాలి. అక్కడి ఏరియా, వాతావరణం బట్టి.. థియేటర్లకు జనాలు రావడం, రాకపోవడం అనేది డిసైడ్ అవుతుంది. జనాలు ఎక్కువగా ఉండే ఏరియాల్లో.. థియేటర్లకు ఫ్లోటింగ్ అనేది ఉంటుంది.
అక్కడి జనాల్లో టైం పాస్ కోసం సినిమా థియేటర్ కి వెళ్లి రావచ్చు అనే ఆలోచన కలగాలి అంటే టికెట్ రేట్లు తగ్గించాలి. అలా తగ్గించుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా థియేటర్లకు ఇవ్వాలి. ఉదాహరణకు వీకెండ్లో టికెట్ రేట్లు 250 రూపాయలకు అమ్మితే, వీక్ డేస్ లో 150 రూపాయలకే పెట్టుకోవాలి. ఈ మధ్యన ఫుట్ ఫాల్స్ పెరిగాయి అని కొందరు అంటున్నారు.
మా (Suresh Babu) పరిశీలనలో అయితే అలాంటిది కనిపించలేదు. సినిమా బాగుంటే జనాలు వస్తున్నారు. పెద్ద సినిమాలు అయినా ఫ్లాప్ టాక్ వస్తే ఆక్యుపెన్సీ అనేది ఉండటం లేదు.అయితే సినిమాలో మంచి కంటెంట్ ఉండాలి. లేదంటే టికెట్ రేట్లు జనాలకి భారం కాకుండా అయినా ఉండాలి” అంటూ చెప్పుకొచ్చాడు.
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?