కొడుకు ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు

నేను చేయించుకొన్నది కిడ్నీ ఆపరేషన్ కాదు అని ఆల్రెడీ రాణా క్లారిటీ ఇచ్చినా కూడా.. ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి రకరకాల ఊహాగానాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా రాణా రీసెంట్ ఫోటోస్ లోని బక్కపలుచని లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో రాణా ఏదో తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే.. తన కొడుకు విషయంలో వైరలవుతున్న రూమర్ల విషయంలో సురేష్ బాబు కాస్త సీరియస్ అయ్యారు. ఇలా సైలెంట్ గా ఉంటే ఇంకెన్ని రూమర్స్ వస్తాయో అని జాగ్రత్తపడినట్లున్నారు.

అందుకే.. రాణాకి జరిగింది కిడ్నీ ఆపరేషన్ కాదని, రాణాకి చిన్నప్పట్నుంచి కంటి సమస్య ఉందని, దానికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకొన్నాడని, ఆపరేషన్ తర్వాత ఎగ్జైమెంట్ కారణంగా బీపీ వల్ల వెయిట్ తగ్గాడు కానీ.. ఆపరేషన్ కి, రాణా బక్కగా అవ్వడానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు సురేష్ బాబు. ఇకపోతే.. రాణా ప్రస్తుతం తన తాజా చిత్రాలైన “విరాటపర్వం 92” మరియు ఇతర ప్రొజెక్ట్స్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తాడు.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus