రానా ఇంత పని పెడతాడు అనుకోలేదు : సురేష్ బాబు

సల్మాన్, ప్రభాస్ లానే రానా కూడా ఇప్పట్లో పెళ్ళి చేసుకోడేమో..! అతనికి పెళ్ళి, సంసారం వంటి వాటి పై ఇంట్రెస్ట్ లేదు అని ఫిక్స్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ ఒక్కసారిగా వారందరికీ.. రానా పెద్ద షాకిచ్చాడు. కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాదు అతని స్నేహితులకు అలాగే తోటి హీరో, హీరోయిన్లకు కూడా పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి. హైదరాబాదీ మ్యారేజ్ ప్లానర్ అయిన మిహిక బజాజ్ అనే అమ్మాయితో రానా చాలా కాలంగా ప్రేమాయణం నడుపుతున్నట్టు తెలుస్తుంది.

‘ఫైనల్ గా ఆమె ఓకే చేసింది’ అని ఒక్క పోస్ట్ పెట్టి నెటిజన్లకు కూడా పెద్ద పని పెట్టాడు రానా. ఇక తన కొడుకు ప్రేమ సంగతి గురించి అతని తండ్రి.. ప్రముఖ నిర్మాత అయిన సురేష్ బాబు కూడా స్పందించాడు. ‘రానా, మిహిక… ఎప్పటి నుండో మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఇలా ప్రేమించుకున్నారని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యాము. లాక్ డౌన్ లో ఏ పని లేకుండా మేమంతా ఖాళీగా ఉన్నాము.. అనుకున్నాడో ఏమో కానీ.. మాకు మంచి పని పెట్టాడు.

ఈ టైం అంతా మేము వారి రానా పెళ్ళి పనులతో గడపాలని ఫిక్స్ అయ్యాం. వెంటనే పెళ్ళి పనులు మొదలు పెట్టెయ్యాలి అని భావిస్తున్నాం. లాక్ డౌన్ ముగిసిన తర్వాత.. డిసెంబర్ కు ముందే పెళ్ళి జరపాలని ప్లాన్ చేస్తున్నాం’.. అంటూ సురేష్ బాబు తెలిపారు. ఈ ఏడాది నితిన్, నిఖిల్ ల పెళ్ళిళ్ళ తో పాటు రానా పెళ్ళి కూడా ఉండబోతుందన్న మాట.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus