VirataParvam: ‘విరాటపర్వం’ విషయంలో నిర్మాత చేసిన తప్పు ఇదేనా..?

టాలీవుడ్ లో ఉన్న సీనియర్ ప్రొడ్యూసర్స్ లో సురేష్ బాబు ఒకరు. సినిమాల ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, రిలీజ్ విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారని ఆయనకు పేరుంది. కథల ఎంపిక దగ్గర నుంచి సినిమాల రిజల్ట్ వరకు ఆయనకు మంచి జడ్జిమెంట్ ఉందని అందరూ చెప్పుకుంటారు. ఈరోజుల్లో నిర్మాణం చాలా రిస్కీగా మారింది. అందుకే పెద్ద సినిమాల జోలికి వెళ్లకుండా.. చాలా వరకు చిన్న, మీడియం రేంజ్ సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నారాయన. అది కూడా పూర్తిగా పెట్టుబడి పెట్టకుండా.. కొంతవరకు వాటా తీసుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు.

‘విరాటపర్వం’ సినిమా విషయంలో కూడా అలానే చేశారు. ఈ సినిమాకి ఆయన సమర్పకుడు మాత్రమే. ఖర్చు పెట్టింది మొత్తం సుధాకర్ చెరుకూరినే. అయితే బిజినెస్ మొత్తం సురేష్ బాబు చేతుల మీదుగానే జరిగింది. అయితే కరోనాకు ముందు మొదలైన ‘విరాటపర్వం’ రిలీజ్ విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సురేష్ బాబు నిర్మించిన ‘నారప్ప’, ‘దృశ్యం2’ సినిమాలను తీవ్ర వ్యతిరేకత మధ్య థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీకి ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆ రెండు సినిమాలను మంచి లాభానికే ఓటీటీలకు ఇచ్చారు సురేష్ బాబు. ఒక దశలో ‘విరాటపర్వం’ సినిమాకు కూడా ఓటీటీ డీల్ పూర్తయిందని.. థియేట్రికల్ రిలీజ్ ఉండదని ప్రచారం జరిగింది. కానీ ఏం జరిగిందో ఏమో.. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమాను జోరుగా ప్రమోట్ చేసి శుక్రవారం నాడు విడుదల చేశారు. సినిమాకి చాలా వరకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఇది నెమ్మదిగా సాగే సీరియస్ సినిమా.

పైగా విషాదాంతంతో కూడిన కథ కావడంతో అనుకున్న స్థాయిలో ఈ సినిమా జనాలకు ఎక్కలేదు. తొలి వీకెండ్ లోనే ఈ సినిమాకి కలెక్షన్స్ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. వీక్ డేస్ లో ఈ సినిమా హోల్డ్ చేయడం కష్టమే అంటున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ నెంబర్స్ చూస్తుంటే.. థియేట్రికల్ రిలీజ్ ఎందుకు చేశారా..? అనిపిస్తుంది. దీనికి బదులు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే మంచి లాభాలు వచ్చేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus